Vijay Deverakonda: రౌడీ బాయ్‌తో డైనమిక్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ యాటిట్యూడ్ కి యువతలో మంచి క్రేజ్ తో పాటు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ యాటిట్యూడ్ కి యువతలో మంచి క్రేజ్‌తో పాటు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరో గా మారిపోయాడు ఈ రౌడీ బాయ్. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాలీవుడ్ టాప్ హీరోగా మారిపోయాడు. ఈ చిత్రాల తర్వాత డియర్ కామ్రెడ్, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ రౌడీ హీరో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల కింద ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు పూరీ జగన్నాథ్. ఈ సినిమాతో ఈయన కోసం మళ్లీ పెద్ద హీరోలు వేచి చూస్తారేమో అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు. కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత.. అనూహ్యంగా విజయ్ తో సినిమాను అనౌన్స్ చేశారు పూరి. లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు డ్యాషింగ్ డైరెక్టర్. ఇక ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అలాగే.. ఇందులో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయ్యింది. ఆగస్టు లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు, ఇటు అనన్య పాండే టాలీవుడ్ కు ఒకేసారి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమ్య కృష్ణ విజయ్ దేవరకొండ తల్లిగా కనిపించనున్నారు. మొన్నామధ్య విడుదల చేసిన టీజర్ లో ముంబై లోని చాయ్ వాలా బాక్సర్ గా ఎలా ఎదిగాడు అనే అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. హై ఎనర్జిటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ కాంబినేషన్లో మరో సినిమాను అనౌన్స్ చేశారు.
జనగణమన అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విజయ్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. మిలటరీ హెయిర్ కటింగ్ తో విజయ్ దేవరకొండ లుక్ ఇటీవల నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే లొకేషన్ ల రెక్కీని నిర్వహించిన టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కోసం ఆసక్తికరమైన ప్లేస్ ని ఫిక్స్ చేసిందట. మొదటి షడ్యుల్ కోసం ఏకంగా సౌత్ ఆఫ్రికాను ఎంపిక చేశారట పూరి. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీకపూర్ నటించే ఛాన్స్ ఉందని టాక్. తాజాగా ఈ సినిమానుంచి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఆకాశం నుంచి ఆర్మీ టీమ్ కిందికి దూకుతున్నట్టు చూపించారు. పూరీ కనెక్ట్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది ఈ మూవీ. ముంబయిలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాప్టర్ లో రాగా, అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న ఆర్మీ కమాండో వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ, వంశీ పైడిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర నిర్మాణంలో టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా పాలుపంచుకుంటున్నాడు. మైహోమ్ సంస్థ సినిమా నిర్మాణ బ్యానర్ శ్రీకర స్టూడియోస్ తరపున వంశీ పైడిపల్లి ముంబయిలో జనగణమన సినిమా ఓపెనింగ్ కు హాజరయ్యారు. ఇక ఈ సినిమాను 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
Our Missile @TheDeverakonda has arrived to accomplish the Mission #JGM ⚡
Directed by #PuriJagannadh ??@Charmmeofficial @directorvamshi #SrikaraStudios
WW Release on AUG 3rd,2023 ? pic.twitter.com/5luIJv7VjS
— Puri Connects (@PuriConnects) March 29, 2022
Touchdown the world to begin a whole new mission !
A Mission with full of PRIDE & RESPONSIBILITY ✊
Launch at 14.20 PM!@TheDeverakonda #PuriJagannadh @Charmmeofficial @directorvamshi #SrikaraStudios pic.twitter.com/ev7RFW1JSw
— Puri Connects (@PuriConnects) March 29, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :