RRR Movie: నీవు లేకుండా నన్ను నేను ఆర్ఆర్ఆర్‌లో ఉహించుకోలేను.. తారక్ ఎమోషల్ లెటర్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్.
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా దేశ్యవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కొమురం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజు గా చరణ్ తమ నటనలతో ప్రేక్షకులను కట్టిపడేసారు. మార్చి 25న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తొలి రోజు తొలి షో నుంచే సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోవడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రికార్డులని తిరగరాస్తూ ఇండియన్ సినీ హిస్టరీలో కొత్త చరిత్ర సృష్టిస్తుంది ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ సినిమాకు ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.. తాజాగా తారక్ ఓ ఓపెన్ లెటర్ రాశారు. . థాంక్యూ అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఓ లెటర్ ఇప్పుడు నెట్టంట సందడి చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైన దగ్గర నుంచి మీ ప్రేమని మాపై చూపిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . ట్రిపుల్ ఆర్ ని ఈ స్థాయిలో తెరపైకి తీసుకొచ్చిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అని తారక్ తన లెటర్ లో పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ నా కెరీర్ లో లాండ్ మార్క్ చిత్రంగా నిలిచింది. నేను నా బెస్ట్ ఇవ్వడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన జక్కన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. నిజంగా నాలోని బెస్ట్ ని బయటికి తీసుకొచ్చి నేనొక వాటర్ లా ఫీలయ్యేలా చేశావు అని పొగడ్తలు కురిపించారు తారక్. నేను నా పాత్రలో ఒదిగిపోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి .. ఈజ్ తో చేయడానికి మీ కన్వెక్షన్ బాగా సహయపడింది. చరణ్ నీవు లేకుండా నేను ట్రిపుల్ ఆర్ లో నటిచడాన్ని ఉహించుకోలేను. అల్లూరి సీతారామరాజు పాత్రకు నువ్వు తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. అలాగే నువ్వు లేకుండా భీమ్ పాత్ర ఇన్ కంప్లీట్ గా ఉండేది. నాకు నీ ఫైర్ ని అందించినందుకు థాంక్యూ బ్రదర్. లెజెండరీ యాక్టర్ అజయ్ సర్ తో కలిసి నటించడం నేను గౌరవంగా భావిస్తున్నాను. అలియా నువ్వోక పవర్ హౌస్. ఈ సినిమాకి అద్భుతమైన బలాన్ని ఇచ్చావు. ఒలివియా మోరీస్ అలీసన్ డూడీ రే స్టీవెన్ సన్ నటనతో హృదయాల్లో నిలిచిపోయారు. వారికి ఇండియన్ సినిమా తరుపున స్వాగతం పలుకుతున్నాను. డీవీవీ దానయ్య గారు యు ఆర్ రాక్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నిర్మించినందుకు ధన్యవాదాలు. ట్రిపుల్ ఆర్ మూవీకి సంగీతంతో లైఫ్ ఇచ్చినందుకు కీరవాణి గారికి నా సిన్సియర్ థాంక్స్. మీరు ఈ చిత్రానికి అందించిన సంగీతం మన సంస్కృతి సంప్రదాయాలని ఎల్లలు దాటించింది. విజయేంద్ర ప్రసాద్ గారు భారతీయ సినిమాల్లో అత్యుత్తమ కథలని అందిస్తున్నారు. ఆయన కథలు ప్రపంచ వ్యాప్తంగా వున్న మిలియన్ ల ఫ్యాన్స్ ని సినీ లవర్స్ హృదయాలని గెలుచుకుంటోంది అన్నారు. అలాగే కార్తికేయ, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ , సెంథిల్ ఇలా అందరికి తారక్ పేరు పేరున థాంక్స్ చెప్పుకొచ్చారు.
I’m touched beyond words… pic.twitter.com/PIpmJCxTly
— Jr NTR (@tarak9999) March 29, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :