Vijay Deverakonda: ఇదంతా ఆ సైడ్ ఎఫెక్టే.. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ..
'లైగర్' సినిమా లావాదేవీల విషయంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమా విషయంలో ఈడి అధికారులు విజయ్ ను ప్రశ్నించారు.
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా లైగర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాకు డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ‘లైగర్’ సినిమా లావాదేవీల విషయంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. దాంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమా విషయంలో ఈడి అధికారులు విజయ్ ను ప్రశ్నించారు. హీరో విజయ్ దేవరకొండ ను అధికారులు బుధవారం విచారించారు. నిన్న (30న) ఈడీ ఆఫీస్ కు వచ్చిన విజయ్ వచ్చారు.. ఈ విచారణలో అధికారులు దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారని తెలుస్తోంది.
ఈ విచారణ అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడాడు.. ” అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారు. కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ అడిగారు. వాళ్ళ జాబ్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పను. ఇదే నేను చెప్పగలను. ఇంతకంటే నేనేమైనా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అలిగేషన్స్ ఏమీ లేవు.. కొన్ని క్లారిఫికేషన్స్ అంతే.. మీరు ఇంతగా ప్రేమిస్తారు కాబట్టి.. ఆ ప్రేమతో వచ్చే పాపులారిటీ వల్ల కొన్ని ఇబ్బందులు.. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి. ఇది కూడా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్” అని విజయ్ దేవరకొండ అన్నారు.
విచారణ పూర్తయ్యింది. మళ్లీ ఆఫీస్ కు రావాలని చెప్పలేదు అని తెలిపాడు విజయ్. ఇక విజయ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. పీఎమ్ఎల్ఏ సెక్షన్ 50 కింద విజయ్ దేవరకొండ ఇచ్చిన స్టేటమెంట్ రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక గతంలో ఇదే విషయం పై దర్శకుడు పూరిజగన్నాథ్, నిర్మాత నటి ఛార్మీ ని కూడా విచారించారు ఈడీ అధికారులు.
లైగర్ మూవీ పెట్టుబడుల్లో హవాలా ట్రాన్‌జాంక్షన్స్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది ఈడీ. దుబాయ్‌కి డబ్బు పంపి, తిరిగి అక్కడ్నుంచి సినిమాలో ఇన్వెస్ట్ చేసినట్లు తేల్చింది. ఇందులో ఈ పొలిటికల్ లీడర్ హ్యాండ్ కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. లైగర్ మూవీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రొడ్యూసర్ ఛార్మినీ ఆల్రెడ్రీ ప్రశ్నించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఇప్పుడు, హీరో విజయ్ దేవరకొండను ఏకంగా 12గంటలపాటు ఇంటరాగేట్ చేయడంతో నెక్ట్స్ ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే, లైగర్ మూవీ నిర్మాణంలో హవాలా కోణం ఉందని అనుమానిస్తోంది ఈడీ. దాంతో, లైగర్ సినిమాతో సంబంధమున్న వాళ్లందరినీ ప్రశ్నించనుంది ఈడీ. మరి, నెక్ట్స్ ఎవరు?. అసలు, లైగర్ మూవీకి నిధులు సమకూర్చిందెవరు?. ఇవన్నీ తేలాలంటే, మెయిన్ మాస్టర్ మైండ్ ఎవరో తేలాల్సిందే!.