Family Star: ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో మార్పు.. ఎందులో.? ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ కానుందంటే.?
విజయ్ దేవర కొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా భారీ అంచనాల మధ్యన ఏప్రిల్ 5న థియేటర్ రిలీజ్ అయింది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు మీడియా , సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా దర్శకుడు పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇలా థియేటర్లలో రిలీజ్ అయిందో.. లేదో.. అప్పుడే ఈ చిత్రం ఓటీటీపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఏ ఓటీటీలో వస్తుంది.? ఎక్కడ చూడొచ్చు.? ఎన్ని రోజుల తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది.? అనే ఒకటే ప్రశ్నలు.
ఇదిలా ఉండగా.. మొదట్లో ఈ సినిమా డిజిటల్ రైట్స్.. రూ. 16 కోట్లకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ మారింది. అఫీషియల్ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం ఓటీటీ రైట్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తైన ఆరు వారాలకు అనగా.. మే రెండు లేదా మూడో వారంలో ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు, హీరో విజయ్ దేవరకొండ క్రేజ్‌తో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ. 43 కోట్లకు అయింది. సో ఇంకా మొదటి రోజే కాబట్టి.. లాంగ్ రన్‌లో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది.? ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.
It’s an eye feast to see families turning up at the theatres in large numbers for the early morning shows and enjoying the movie ✨
It’s time to Celebrate #TheFamilyStar in cinemas with your family ❤️🔥
Book your tickets now! 🎟️ https://t.co/j0TLVnn8gY@TheDeverakonda… pic.twitter.com/0VWz2aQyO1
— BA Raju’s Team (@baraju_SuperHit) April 5, 2024