AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక పోస్టర్ రిలీజ్.. పుష్పరాజ్ భార్య శ్రీవల్లీ కొత్త లుక్ చూశారా ?..

గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన బన్నీ పోస్టర్ మూవీపై హైప్ పెంచేసింది. ఇక ఈరోజు రష్మిక బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి శ్రీవల్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ పార్టులో గ్రామీణ యువతిగా ఎంతో సింపుల్ గా కనిపించిన శ్రీవల్లీ.. సెకండ్ పార్టులో మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తుంది.

Pushpa 2: పుష్ప 2 నుంచి రష్మిక పోస్టర్ రిలీజ్.. పుష్పరాజ్ భార్య శ్రీవల్లీ కొత్త లుక్ చూశారా ?..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Apr 05, 2024 | 2:32 PM

Share

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పుష్ప 2. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన బన్నీ పోస్టర్ మూవీపై హైప్ పెంచేసింది. ఇక ఈరోజు రష్మిక బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి శ్రీవల్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ పార్టులో గ్రామీణ యువతిగా ఎంతో సింపుల్ గా కనిపించిన శ్రీవల్లీ.. సెకండ్ పార్టులో మాత్రం చాలా రిచ్ గా కనిపిస్తుంది. పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారంతో ధగ ధగ మెరిసిపోతుంది. చేతినిండా గాజులు, మెడలో హారాలు, నల్లపూసలు, నడుముకి వడ్డాణంతో పుష్పరాజ్ భార్య శ్రీవల్లీ అంటే తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం రష్మిక పోస్టర్ నెట్టింట వైరలవుతుంది. అటు సోషల్ మీడియా వేదికగా రష్మికకు సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

ఫస్ట్ పార్టులో పుష్పరాజ్ శ్రీవల్లి మెడలో తాళి కట్టడంతోనే ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత పుష్పరాజ్ భార్య స్థానంలో శ్రీవల్లీ ఎలా కనిపించనుందనే విషయంపై ఇన్నాళ్లు సస్పెన్స్ నెలకొంది. గతంలో రష్మికకు సంబంధించిన ఓ పోస్టర్ లీక్ కావడంతో శ్రీవల్లీ రేంజ్ మారిపోయిందంటూ కామెంట్స్ వచ్చాయి. ఎర్ర చీరలో ఒంటినిండా బంగారు నగలతో కనిపించడంత ఆమె లుక్ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన శ్రీవల్లీ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. రష్మిక బర్త్ డే సందర్భంగా ఆమె అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కూడా రివీల్ చేస్తున్నారు మేకర్స్. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా నుంచి రష్మిక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కాలేజీ స్టూడెంట్ లుక్స్ తో కట్టిపడేసింది. ఆ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ భాషలలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.