Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daggubati Venkatesh : మరో రీమేక్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరో.. ఈ సారి అజిత్ సినిమాతో రానున్న వెంకీ

సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌‌ది సపరేట్ స్టైల్.. కుర్రహీరోలతో కలిసి సినిమాలు చేస్తుంటారు .. అదే విధంగా వాళ్లకు పోటీగానూ సినిమాలు చేస్తుంటారు

Daggubati Venkatesh : మరో రీమేక్‌కు రెడీ అవుతున్న సీనియర్ హీరో.. ఈ సారి అజిత్ సినిమాతో రానున్న వెంకీ
Venky
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 08, 2021 | 12:42 PM

Daggubati Venkatesh : సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్‌‌ది సపరేట్ స్టైల్.. కుర్రహీరోలతో కలిసి సినిమాలు చేస్తుంటారు .. అదే విధంగా వాళ్లకు పోటీగానూ సినిమాలు చేస్తుంటారు వెంకీ. ఇటీవలే నారప్ప సినిమాతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్… ఇప్పుడు ఎఫ్ 3 సినిమాతో మరోసారి నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్నాడు. అసురన్ రీమేక్‌గా వచ్చిన నారప్ప సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది ఈ సినిమాలో వెంకీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. ఇక ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎఫ్ 2సినిమాకు సీక్వెల్‌గా రాబోతుంది. ఎఫ్ 2 సినిమా మంచి విజయాన్ని సంధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శరవేగంగా ఎఫ్ 2 షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో వెంకీతోపాటు వరుణ్ తేజ్, సునీల్ నటిస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలో మరో సినిమాతో వెంకీ రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

వెంకటేష్‌కు రీమేక్ సినిమాలు కొత్తేమీకాదు. ఇప్పటికే చాలా సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో అజిత్ సినిమాను రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. ‘ఎన్నై అరిందాల్’ అనే సినిమాను వెంకటేష్ రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా తెలుగులో ‘ఎంతవాడుగానీ’ టైటిల్‌తో డబ్ అయ్యి హిట్ టాక్‌ను అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నారట సురేష్ బాబు. ఆయన ఈ సినిమాను వెంకటేశ్ హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Tollywood Drugs Case: ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానా.. కొనసాగుతున్న విచారణ.. వీడియో

Viral video : పిల్లను కాపాడుకోవడానికి తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో

Mask less Man: మాస్క్ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి..