viral video : అమ్మో వీడు మామూలోడు కాదుగా… సలసల కాగే నీళ్లలో సరదాగా కూర్చున్న బుడ్డోడు..

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే.. ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే. భూమిమీద ఎక్కడ ఏం జరిగిన అది మన కళ్ళముందుకు వచ్చేస్తుంది.

viral video : అమ్మో వీడు మామూలోడు కాదుగా... సలసల కాగే నీళ్లలో సరదాగా కూర్చున్న బుడ్డోడు..
Follow us

|

Updated on: Sep 08, 2021 | 12:33 PM

స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే.. ప్రపంచం అరచేతిలో ఉన్నట్టే. భూమిమీద ఎక్కడ ఏం జరిగిన అది మన కళ్ళముందుకు వచ్చేస్తుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైపోయింది. ఓపెన్ చేస్తే చాలు.. నిత్యం రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. ఆ వీడియోలు ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తే చాలు.. క్షణాల్లో వైరల్ అయిపోతాయి. అలాగే ఈ వైరల్ వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే మనం ఎన్నో వింతైన వీడియోలు చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ వీడియో కూడా అలాంటిదే.. మాములుగా మనం వేడి నీళ్లు కొంచం పడితేనే తట్టుకోలేక గంతులు వేస్తాం.. కానీ ఇక్కడ ఈ బుడతడు సలసల కాగుతున్న నీటిలో ఇలా జలకాలాడుతున్నాడు.

బాలుడు ఓ కడాయిలో కూర్చొని ఉండగా కింద మంట పెట్టారు. ఆ కడాయిలో నీరు మరుగుతున్నా.. ఆ బాలుడు ఏమాత్రం చలించకుండా కూర్చొని ఉన్నాడు. దాంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోకు లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ వీడియో ఫేక్ అంటున్నారు కొందరు నెటిజన్లు. ఇది ఒక మ్యాజిక్ ట్రిక్.. జనాలను బుడ్డోడు మోసం చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియా ఇప్పుడు నెట్టింట మరోసారి వైరల్‌గా మారింది .

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral video : పిల్లను కాపాడుకోవడానికి తల్లి కుక్క తాపత్రయం.. మనసుకు హత్తుకుంటున్న వీడియో

Mask less Man: మాస్క్ పెట్టుకోలేదని డ్రైవర్ కు ఫైన్.. దీంతో ఆ టాక్సీవాలా చేసిన పని చూడండి..