Venkatesh Daggubati: క్రేజీ రికార్డుపై కన్నేసిన వెంకీ.. సీనియర్ హీరో జోరు మాములుగా లేదుగా..
రెగ్యులర్‌గా ఓ తెలుగు హీరో సినిమా అంటే కనీసం మూడు నాలుగు నెలలు షూట్ చేస్తారు.. అదే టాప్ హీరో సినిమా అయితే ఏడాది టైం పడుతుంది.
రెగ్యులర్‌గా ఓ తెలుగు హీరో సినిమా అంటే కనీసం మూడు నాలుగు నెలలు షూట్ చేస్తారు.. అదే టాప్ హీరో సినిమా అయితే ఏడాది టైం పడుతుంది. కానీ ఈ లెక్కలను తారు మారు చేసేస్తున్నారు ఓ సీనియర్ హీరో. యస్.. గతంలో ఎన్నడూ లేని విధంగా జస్ట్ 30 రోజుల్లో ఓ సినిమాను కంప్లీట్ చేసేస్తున్నారు.
నారప్ప షూటింగ్ పూర్తి చేసిన వెంటనే.. ఎఫ్ 3 సెట్‌లోకి అడుగుపెట్టారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే దృశ్యం 2ను పట్టాలెక్కించారు. ఒరిజినల్‌ను డైరెక్టర్ చేసిన జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లోనే తెరకెక్కుతున్న ఈ సినిమాను జస్ట్ వన్ మంత్‌లో పూర్తి చేసేలా పక్కాగా స్కెచ్ రెడీ చేశారు. ఎక్కువ లొకేషన్స్, కాంబినేషన్స్ సీన్స్ అవసరం లేకపోవటంతో సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను ఫినిష్ చేసేలా డేట్స్ ప్లాన్ చేశారు. దీంతో వెంకీ లిస్ట్‌లో ఓ రేర్ రికార్డ్ యాడ్ అవుతోంది. ఎయిటీస్‌లో అయితే… హీరోలు ఇంత స్పీడుగా సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య కాలంలో జస్ట్ 30 డేస్‌లో సినిమా కంప్లీట్ చేస్తున్న ఏకైక హీరో వెంకీనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
వీటిలో నారప్ప (మే 14) .. ఎఫ్ 3 (ఆగస్టు 27) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అలాగే దృశ్యం 2 మొత్తం షూటింగ్ ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. జూన్ చివరి నాటికి అన్ని పనులు ముగించి జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారట. ఇలా ఈ సమ్మర్ లో వెంకీ ఏకంగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. ఇలా వరుస సినిమాలతో కుర్రహీరోలకు గట్టిపోటీ ఇస్తున్నాడు ఈ సీనియర్ హీరో.
వకీల్ సాబ్ లైవ్….
Also Read: ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’.. లుక్స్, గ్రేస్ విషయంలో అదే ఫామ్‌లో సీనియర్స్
నక్కి మరీ ఎలుకపై అటాక్ చేసిన పాము.. మూషికం వెనక కాళ్లతో తన్నితే స్నేక్ దిమ్మతిరిగింది