Tollywood Senior Heros: ‘ఏజ్‌ ఈజ్‌ జస్ట్ ఏ నంబర్’.. లుక్స్‌, గ్రేస్‌ విషయంలో అదే ఫామ్‌లో సీనియర్స్

ఏజ్‌ ఈజ్‌ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు మన సీనియర్ హీరోలు. యంగ్ జనరేషన్‌ ఫుల్ ఫాంలో దూసుకుపోతుంటే.. మేము సైతం అంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు.

Tollywood Senior Heros: 'ఏజ్‌ ఈజ్‌ జస్ట్ ఏ నంబర్'.. లుక్స్‌, గ్రేస్‌ విషయంలో అదే ఫామ్‌లో సీనియర్స్
Tollywood Senoir Heros
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 04, 2021 | 9:31 PM

ఏజ్‌ ఈజ్‌ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు మన సీనియర్ హీరోలు. యంగ్ జనరేషన్‌ ఫుల్ ఫాంలో దూసుకుపోతుంటే.. మేము సైతం అంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. కంటెంట్ విషయంలోనే కాదు.. లుక్స్‌, గ్రేస్‌, యాక్షన్‌లోనూ నవతరంతో పోటి పడి సత్తా చాటుతున్నారు. రీసెంట్‌గా ఆచార్య, వైల్డ్ డాగ్ సినిమాలతో సీనియర్ల సత్తా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

60 ఏళ్లు దాటిన నాగ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద రికార్డ్‌లను వేటాడుతున్నారు. వైల్డ్‌ డాగ్ ఫుల్ యాక్షన్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చిన కింగ్‌… యునానిమస్‌ పాజిటివ్‌ టాక్‌తో మెప్పిస్తున్నారు. కథా కథనాలు, మేకింగ్ పక్కన పెడితే… ఈ వయసులోనూ నాగ్‌ చూపించిన డెడికేషన్‌…ఆయన చేసిన యాక్షన్‌, ఫిట్‌నెస్‌ లుక్స్‌ ఇప్పుడు హట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా వైల్డ్ డాగ్ యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో నాగ్ ఈజ్‌ చూస్తే… 60 ప్లస్ అన్న విషయం అస్సలు నమ్మలేకపోతున్నామంటున్నారు జనాలు. ఈ సినిమాలో NIA ఆఫీసర్ విజయ్ వర్మగా పర్ఫెక్ట్‌ ఫిట్‌నెస్‌తో కనిపించారు. ఈ వయసులోనూ నాగ్‌లోని చార్మ్ చూసి ఇంకా మన్మథుడే అంటున్నారు ఫ్యాన్స్‌.

నటనలోనే కాదు… గ్లామర్‌ మెయిన్‌టెనెన్స్‌లోనూ తాను అందరికీ ఆచార్యే ఘంటా భజాయించి చెప్పేస్తున్నారు మెగాస్టార్‌ చిరంజీవి. తాజాగా లాహె లాహె లిరికల్‌ సాంగ్‌లో మెగా లుక్స్‌, ఆయన స్టెప్స్ చూసిన ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. వింటేజ్ మెగాస్టార్‌ను చూపిస్తామంటూ మాట ఇచ్చిన ఆచార్య మేకర్స్‌.. మాట నిలబెట్టుకున్నారని ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. అంతకు ముందు చెర్రీ బర్త్‌ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లోనూ చిరు లుక్స్‌ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాయి. ఈ స్టిల్‌లో చిరు, చెర్రీల మధ్య ఏజ్‌ గ్యాపే కనిపించలేదని మురిసిపోయారు చిరు ఫ్యాన్స్‌. టీజర్‌ ఎండింగ్‌లో మెగాస్టార్ చెప్పిన డైలాగ్‌ అయితే వేరే లెవల్‌ అంటున్నారు.

ఇక పవర్‌ హౌస్‌ బాలయ్య కూడా కుర్ర హీరోలతో పోటి పడుతున్నారు. ప్రజెంట్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బీబీ 3లో నటిస్తున్న నందమూరి హీరో… ఆ మూవీలో డిఫరెంట్‌ లుక్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పటికే స్లిమ్‌గా కనిపిస్తున్న బాలయ్య, తెర మీద మరింత యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌గా కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

లాస్ట్ బట్‌ నాట్‌ ద లీస్ట్‌… విక్టరీ హీరో వెంకటేష్‌ కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. నారప్ప షూటింగ్‌ పూర్తయిన వెంటనే బ్రేక్ తీసుకోకుండా… ఎఫ్ 3 షూటింగ్‌ స్టార్ట్ చేశారు. ఆ షూట్‌కు బ్రేక్‌ ఇచ్చి… దృశ్యం సీక్వెల్‌ను స్టార్ట్ చేశారు. ఈ గ్యాప్‌లో నారప్ప పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా చక్కబెట్టేస్తున్నారు. దృశ్యం సీక్వెల్‌తోనూ కొత్త ట్రెండ్ సెట్‌ చేస్తున్నారు వెంకీ. ఈ సినిమాను కేవలం 30 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ రెడీ చేశారు. లుక్స్ విషయంలోనూ కుర్ర హీరోలకు గట్టి పోటినే ఇస్తున్నారు ఈ సీనియర్ స్టార్‌. ఇలా సీనియర్ హీరోలంతా జోరు చూపిస్తుండటంతో యంగ్ జనరేషన్‌ కూడా అలెర్ట్‌ మోడ్‌లో పనిచేస్తోంది.

Also Read: నక్కి మరీ ఎలుకపై అటాక్ చేసిన పాము.. మూషికం వెనక కాళ్లతో తన్నితే స్నేక్ దిమ్మతిరిగింది

పులి మాదిరిగా పిల్లి వేట.. దాని స్కిల్ చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!