Rajamouli : ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ వారణాసి.. రాజమౌళి క్షమాపణ చెప్పాల్సిందేనట !!
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశాడు డైరెక్టర్ రాజమౌళి. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టాడు. ఇక ఇప్పుడు వారణాసి సినిమాతో మరో అద్భుతం సృష్టించేందుకు రెడీ అయ్యారు. కానీ ఇటీవల ఆయన మాట్లాడిన మాటలతో చిక్కుల్లో పడ్డారు.

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తర్వాత జక్నన్న తెరకెక్కిస్తున్న సినిమా వారణాసి. ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకున్నాయి. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఈచిత్రం గ్లింప్స్ విడుదల చేయగా మరింత హైప్ పెరిగింది. అయితే ఇదే వేడుకలో జక్కన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయనను చిక్కుల్లో పడేశాయి. ఈ ఈవెంట్ లో టెక్నికల్ ఎర్రర్ వల్ల గ్లింప్స్ వీడియో పదే పదే ఆగిపోవడంతో రాజమౌళి అసహనానికి గురయ్యారు. ఆ ఆవేశంలో ఆయన చేసిన కామెంట్స్ పై ఇప్పుడు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
“నాకు దేవుడిపై నమ్మకం లేదు.. కానీ మా నాన్న హనుమంతుడు నా వెన్నంటే ఉండి నడిపిస్తాడని అంటారు. ఇలా జరుగుతుంటే ఎలా నడిపిస్తున్నాడని కోపం వచ్చింది” అని అన్నారు. దీంతో రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాజాగా విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ మాట్లాడుతూ..”హనుమంతుడిని, రాముడిని, కృష్ణుడిని అవమానించే హక్కు ఎవరికీ లేదు. దేవుళ్లపై మీ వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధించాయి. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతో మీ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటాం” అని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‌తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. “దేవుళ్లపై నమ్మకం లేకపోతే రామాయణం, మహా భారతం నేపథ్యంతో సినిమాలు తీసి కోట్లు సంపాదించడం ఎలా న్యాయం ?.. రాజమౌళి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన సినిమాలను బహిష్కరించాలని పిలుపునిస్తున్నాం ” అని అన్నారు. మరోవైపు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే జక్కన్నపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదు గాగా.. మరోవైపు వారణాసి టైటిల్ పై వేరే బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ వివాదంపై రాజమౌళి స్పందించలేదు.
దేవుడు అంటే నమ్మకం లేదు..But జనాల నమ్మకాలతో ఇంకా డబ్బులు సంపాదించాలి. జనాలు ఇంకా ఎక్కువ నమ్మేలా సీన్ లు పెట్టాలి.
మనం అభిమానించే దర్శకుడు కూడా మనలా నమ్మాలి ,ఆలోచించాలి అనేది కూడా మూర్ఖత్వమే.
నమ్మడం నమ్మకపోవడం తన ఇష్టం.
కానీ అంత పెద్ద వేదిక మీద ఈ కామెంట్స్ నే కొంచెం బాధాకరం. pic.twitter.com/MYRmlRa6mR
— సర్ధార్ సర్వాయి పాపన్న (@kaloji2022) November 16, 2025
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
