AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Satyajith: సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత..

గత కొద్ది కాలం క్రితం సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటడాయి. ఒకవైపు కరోనాతో పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా

Satyajith: సినీ పరిశ్రమలో పెను విషాదం.. ప్రముఖ నటుడు సత్యజిత్ కన్నుమూత..
Satyajith
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 11, 2021 | 11:30 AM

Share

గత కొద్ది కాలం క్రితం సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటడాయి. ఒకవైపు కరోనాతో పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా.. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో మరణించారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధంలేకుండా.. సినీ పరిశ్రమ పూర్తిగా దుఃఖంలో మునిగిపోయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిత్రపరిశ్రమలో ఇప్పుడు మరో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ సినీ నటుడు సత్యజిత్ (72) కన్నుముశారు. ఆదివారం తెల్లవారుజామున బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా సమాచారం.

ఇటీవల సత్యజిత్ కాలికి గాయమైంది. దీంతో ఆయన గ్యాంగ్రిన్‏తో చికిత్స పొందుతుండగా.. ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటున్న సమయంలోనే సత్యజిత్ కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఈరోజు సత్యజిత్ అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు. కన్నడంలో సత్యజిత్ ఆరు వందలకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన అసలు పేరు సయ్యద్ నిజాముద్దీన్ సత్యజిత్. పదవ తరగతి వరకు చదివిన ఆయన.. సినిమాలపై ఉన్న ఇష్టంతో 1986లో అరుణరాగ సినిమా ద్వారా కన్నడ చిత్రరంగంలోకి అడుగుపెట్టారు. విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ చిత్రపరిశ్రమలో సత్యజిత్ స్థానం ప్రత్యేకం. ఇక ఆయన హఠాన్మరణంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Dil Raju: ఆయనతో సినిమా చేసే ఛాన్స్ రాలేదు.. పెళ్లి సందD ఈవెంట్‏లో అసలు విషయం చెప్పిన దిల్ రాజు..

Megastar Chiranjeevi: అలాంటి వారిని దూరం పెట్టాలి.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా ?.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన..

Bigg Boss 5 Telugu: హమీదను ఎలిమినేట్ చేయడం దారుణం అంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..