AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: అలాంటి వారిని దూరం పెట్టాలి.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా ?.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం పెళ్లి సందD. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ

Megastar Chiranjeevi: అలాంటి వారిని దూరం పెట్టాలి.. ఒక్క పదవి కోసం అంత లోకువ కావాలా ?.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..
Megastar
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2021 | 8:14 AM

Share

సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ చిత్రం పెళ్లి సందD. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ రోనంకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో శ్రీలీలా హీరోయిన్‏గా నటిస్తోది. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ పెళ్లి సందD సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకున్నారు. ఈ చిత్రంతో దర్శకేంద్రుడు వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ దసరా కానుగా అక్టోబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‏ను నిన్న సాయంత్రం హైదరాబాద్‏లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న అందరు హీరోల మధ్య మాలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే… ఇలాంటి వివాదాలు, కొట్టుకోవడాలు, మాటలు అనడం… అనిపించుకోవడం ఉండదు కదా.. ఏదైనా సర శాశ్వతం కాదు. రెండెళ్లుంటాయా ? మూడేళ్లు ఉంటాయా ? నాలుగేళ్లు ఉంటాయా? ముఖ్యంగా చిన్న చిన్న పదవులు.. భాద్యతల్లాంటివి. వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటివాళ్లకు ఎంతటి లోకువ అవుతాం ఒక పదవి కోసం అంత లోకువ కావాలా ? అది ఎవరైనా కానీయ్.. నేను ఏ ఒక్కరినీ వేలెత్తి నిందించడం లేదు. ప్రతీ ఒక్కరూ మెచ్యూర్డ్‏గా, విజ్ఞతతో ఉండాలి. అంతేతప్పా, మన ఆధిపత్యం, ప్రభావం చూపించడానికి చేయకూడదు. వాళ్లు అన్నారు కదా ? అని మనం అనకూడదు. సమస్య ఎక్కడ ప్రారంభం అయింది.. అనేది మాత్రమే చూడాలి. ఎవరి మూలన ఏ వివాదాలు ప్రారంభయ్యాయో అతడికి హోమియే వైద్యం చేయించాలి. ఎందుకంటే మొదళ్ల నుంచి వ్యాధిని తొలగించే లక్షణం వాటికి ఉంటుంది. మనం కూడా మూలాల్లోకి వెళ్లాలి. అలాంటి వారిని గుర్తించాలి. వారిని దూరం పెడితే ఇప్పుడు మేం ఎలా ఉన్నామో.. అందరూ అలా వసుదైక కుటుంబంలా ఉంటాం. ఆత్మీయంగా, అప్యాయంగా, ప్రేమగా ఉండాలే తప్పా. చిన్న చిన్న గొడవలతో అవతలివారికి లోకువ కాకుడదు. ముఖ్యంగా మీడియా వారికి మనం ఆహారం అయిపోకూడదు అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Bigg Boss 5 Telugu: కాజల్ ఫేక్… ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడు తెలియకుండా మాట్లాడకు.. హమీదా సూచన..

Bigg Boss 5 Telugu: ఇంటి సభ్యులకు నాగ్ స్పెషల్ సర్‏ప్రైజ్.. వెక్కివెక్కి ఏడ్చిన లోబో..

Sreeleela : నవ్వే నిన్ను చూసి చందమామే చిన్నబోదా..! బాపు బొమ్మలా అందాల శ్రీలీల…