Bigg Boss 5 Telugu: హమీదను ఎలిమినేట్ చేయడం దారుణం అంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.. సినిమాలకు మించిన ట్విస్టులు, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్, గొడవలు ఇలా బిగ్ బాస్ హౌస్ అంతా నానా హంగామాగా ఉంటుంది.

Bigg Boss 5 Telugu: హమీదను ఎలిమినేట్ చేయడం దారుణం అంటున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..
Hameida
Follow us
Rajeev Rayala

| Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 12:34 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.. సినిమాలకు మించిన ట్విస్టులు, ఎమోషన్స్, లవ్ ట్రాక్స్, గొడవలు ఇలా బిగ్ బాస్ హౌస్ అంతా నానా హంగామాగా ఉంటుంది. ఇప్పటికే విజయవంతంగా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు అదే జోష్ లో సీజన్ 5 ను కంప్లీట్ చేసే పనిలో ఉంది. అయితే ఈ సీజన్ 5లో ఏకంగా 19మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. మాములుగా 14మంది.. 16మంది ఉంటేనే రచ్చ రచ్చగా ఉండే హౌస్ ఈసారి 19 మంది వెళ్లడంతో మరింత రసవత్తరంగా హంగామాగా సాగుతుంది. ఇక ఇప్పటికే హౌస్ నుంచి 5 మంది బయటకు వచ్చేశారు. వీరిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ ఉండగా తాజాగా హమీద కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. హమీద హౌస్ లోకి వెళ్లిన దగ్గర నుంచి శ్రీరామ్ తో ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇప్పుడిప్పుడే ప్రేమ ముదురుతోంది అనుకునే సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. అనూహ్యంగా హామీదను ఎలిమినేట్ చేశారు.

అయితే హమీద ఎలిమినేట్ అవ్వడం దారుణం అంటున్నారు కొందరు నెటిజన్లు, హౌస్ లో చాలా మంది గేమ్ సరిగా ఆడనివారిని ఉంచి హామీదను బయటకు పంపడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఇక హౌస్ లో ఇప్పటికే శ్రీరామ్ హమీదాల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్న సమయంలో ఇలా వాళ్ళను విడతీశారంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే హమీద ను తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటారని అంటున్నారు మరి కొందరు. బిగ్ బాస్ సీజన్ 5 లో ఇప్పటి వరకు వైల్డ్ ఎంట్రీ కాని.. సీక్రెట్ రూమ్ ఎంట్రీ కాని జరగలేదు. కనుక హమీదాతో సీక్రెట్ రూమ్ ఓపెన్ ఉంటుందేమో అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక నెటిజన్లు హమీదా ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. శ్రీరామ చంద్రతో మంచి లవ్ ట్రాక్ నడపడంతో పాటు ఇంట్లో అల్లరిగా అందరిని ఆకట్టుకుంటున్న హమీదాను ఎలిమినేట్ చేయడం దారుణం అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :  MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..

Bigg Boss 5 Telugu: శ్రీరామచంద్ర పాటకు కన్నీరు పెట్టుకున్న హమీద..

Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..