AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartikeya Gummakonda : సిద్ధార్థ్ అంటే నాకు చాలా జెలసీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్ఎక్స్ 100 హీరో

Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమా ‘మహా సముద్రం’. .

Kartikeya Gummakonda : సిద్ధార్థ్ అంటే నాకు చాలా జెలసీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్ఎక్స్ 100 హీరో
Kathikeya
Rajeev Rayala
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 11, 2021 | 12:33 PM

Share

Kartikeya Gummakonda : Rx 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న సినిమా ‘మహా సముద్రం’. . ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న సినిమాలో శర్వానంద్, సిద్దార్థ్  హీరోలుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న గ్రాండ్ గా విడుదల కాబోతుంది ఈ సినిమా. ఈ సందర్భంగా ఏర్పడు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు హాజరైన ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ మాట్లాడుతూ..

“ఈ సినిమా ఫంక్షన్ కి నన్ను ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా మూవీ ఫంక్షన్ గానే నేను భావిస్తున్నాను అన్నారు కార్తికేయ. అజయ్ భూపతి నటుడిగా నాకు మరో జన్మను ఇచ్చాడు. నేను ఇలా ఉండటానికి  ఆయనే కారణం. ఈ కథను అజయ్  ‘ఆర్ ఎక్స్ 100’ సినిమా షూటింగు సమయంలోనే నాకు చెప్పాడు. అప్పడు ఆ సినిమా హిట్ కాకపోతే ఊరెళ్లి గేదెలు కాసుకుంటానని అన్నాడు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన అంతే కాన్ఫిడెంట్‌గా మాట్లాడాడు. అజయ్ నన్ను పొగడడం కంటే తిట్టడమే ఇష్టం .. ఎందుకంటే ఆ తిట్లలో ఒక ప్రేమ ఉంటుంది. అందువలన ఆయన తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తుంటాను.

అజయ్ ‘ఆర్ ఎక్స్ 100’ తో అంతపెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత కూడా రెండో అవకాశాన్ని అందుకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడవలసి వచ్చింది. అజయ్ తో వేరే హీరోలు ఇబ్బంది పడతారేమో అనుకునేవాడిని. కానీ నేను ఆయనతో ఒక కొత్త హీరోలా ఎలా చేశానో శర్వానంద్ కూడా ఒక స్నేహితుడిగా ఈ సినిమా చేశారని తెలిసింది. శర్వానంద్ కెరియర్ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. చిన్న చిన్న ఫ్రెండ్ రోల్స్ దగ్గర నుంచి సైడ్ రోల్స్ చేస్తూ ఆయన స్టార్ హీరోగా ఎదుగుతూ వచ్చారు. కష్టపడి పైకొచ్చిన హీరోల పేర్లను గురించి నేను ఇంట్లో చెప్పే పేర్లలో ఆయన పేరు కూడా ఉంటుంది అన్నారు. అలాగే సిద్ధార్థ్ గారంటే నాకు చాలా జెలసీ .. చదువుకునే రోజుల్లో మనకి క్రష్ ఉన్న అమ్మాయిల క్రష్ గా ఆయన ఉండేవారు. ‘ఏ అమ్మాయి చూసినా సిద్ధార్థ్ అంటుందేంట్రా బాబూ’ అని నేను ఆయనను కొన్నిసార్లు తిట్టుకునేవాడిని కూడా.. ‘బొమ్మరిల్లు’ సినిమా చూసినప్పుడు నేను 6 క్లాస్ లో ఉన్నాను. కానీ ఇప్పుడు ఆయనను చూస్తుంటే నాకంటే చిన్నవాడిలా కనిపిస్తున్నాడు. ఆ సీక్రెట్ ఏంటి సార్ అని అడిగితే మాత్రం చెప్పడం లేదు. ‘మిమ్మల్ని అలా చూస్తుంటే గొంతు దిగడం లేదు నాన్న’ అనాలనిపిస్తోంది అంటూ సిద్ధార్థ్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు కార్తికేయ.

మరిన్ని ఇక్కడ చదవండి :  MAA elections 2021:: ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే.. విష్ణుకు అభినందనలు తెలిపిన మెగాస్టార్..

Bigg Boss 5 Telugu: శ్రీరామచంద్ర పాటకు కన్నీరు పెట్టుకున్న హమీద..

Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం