Bigg Boss 5 Telugu: శ్రీరామచంద్ర పాటకు కన్నీరు పెట్టుకున్న హమీద..

Rajeev Rayala

Rajeev Rayala | Edited By: Anil kumar poka

Updated on: Oct 11, 2021 | 1:15 PM

బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే 5 వారాలను పూర్తి చేసుకుంది. హౌస్ లో కావాల్సినంత వినోదాన్ని పంచుతూ ఈ గేమ్ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

Bigg Boss 5 Telugu: శ్రీరామచంద్ర పాటకు కన్నీరు పెట్టుకున్న హమీద..
Hameeda

Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే 5 వారాలను పూర్తి చేసుకుంది. హౌస్ లో కావాల్సినంత వినోదాన్ని పంచుతూ ఈ గేమ్ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 19 మందిలో ఇప్పటికే నలుగురు బయటకు వచ్చేశారు. తాజ్ హౌస్ నుంచి 5 ఎలిమినేటర్ గా హమీద్ అవుట్ అయ్యింది. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తున్న హమీద ఈ సారి ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది. వారాంతం వహించిందంటే చాలు హౌస్ కి హోస్ట్ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి సందడిని రెట్టింపు చేస్తారు. ఈ వారం కూడా అదే జరిగింది హౌస్ లో దసరా సంబరాలు జరిగాయి. నవరాత్రుల సందర్భంగా ఇంటి సభ్యులకు నాగార్జున స్పెషల్ గిఫ్ట్‌లు ఇచ్చాడు. అలా మొత్తంగా తొమ్మిది ఆటలు, తొమ్మిది బహుమతులు అంటూ ఇంటి సభ్యులకు ఫ్యామిలీ మెంబర్స్ వీడియోలను చూపించాడు. దాంతో అందరు ఎమోషనల్ అయ్యారు.

చివరగా ఎలిమినేషన్ ప్రక్రియ రాగానే అందరిలో ఉత్కంఠ నెలకొంది. చివరకు హమీద ఎలిమినేటి అయ్యి హౌసునుంచి బయటకు వచ్చేసింది. హమీద ఎలిమినేట్ అని ప్రకటించగానే శ్రీ రామ చంద్ర ఎమోషనల్ అయ్యాడు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హమీద.. ఒక్కొక్కరి గురించి మంచి చెడులను చెప్పింది. అయితే హమీదకు వెళ్లే ముందు తన ప్రేమను పాట రూపంలో వినిపించాడు శ్రీరామచంద్ర. నా హృదయంలో నిదురించే చెలి అంటూ శ్రీరామచంద్ర పాడిన పాటకు హమీద కన్నీరు పెట్టేసుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vishnu Vs Prakash Raj: విష్ణుకి ప్లస్ అయిన అంశాలు.. ప్రకాష్ రాజ్‌కి మైనస్ అయిన అంశాలు ఇవే..

MAA Elections Winners: మంచుకే ‘మా’ పీఠం… ఉత్కంఠ పోరులో విష్ణు విజయం…

Pelli SandaD Pre Release Event: చిరు, వెంకీ స్పెషల్ అట్రాక్షన్.. గ్రాండ్‌గా ‘పెళ్లి సందడి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu