MAA Elections Winners: మంచుకే ‘మా’ పీఠం… ఉత్కంఠ పోరులో విష్ణు విజయం…

'మా' ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చేశాయి. గెలిచినవారి జాబితాను బయటకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు.

MAA Elections Winners: మంచుకే 'మా' పీఠం... ఉత్కంఠ పోరులో విష్ణు విజయం...
Manchu Vishnu Won
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2021 | 10:33 PM

‘మా’ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చేశాయి. గెలిచినవారి జాబితాను బయటకు వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విష్ణు విజయం సాధించారు. ఇది విష్ణు ప్యానల్‌కు ఏకపక్ష విజయమనే చెప్పాలి. ప్రధాన పోస్టుల్లో కూడా మంచు విష్ణు ప్యానల్‌కు సంబంధించిన వారే విజయం సాధించారు. శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుంచి గెలుపొందారు. భారీ విజయంతో మంచు ఫ్యామిలీ మద్దుతుదారులు మోహన్ బాబు జిందాబాద్, విష్ణు బాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు ఫ్యామిలీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈసీ మెంబర్స్ విషయంలో మాత్రం ఫలితాలు విభిన్నంగా వచ్చాయి. ప్రకాశ్ రాజ్‌కు ప్యానల్‌కు చెందిన 11 మంది ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్‌గా గెలిచారు. విష్ణు ప్యానల్‌కు చెందిన ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలిచారు. కాగా సభ్యులు సంయనమం పాటించాలని, ఓవరాక్షన్ చేయొద్దని సభ్యులకు సూచించారు. ప్యానెల్‌లో గెలిచిన తర్వాతే బయటకు వెళ్లాలని చెప్పారు.

విష్ణు ప్యానల్‌లో గెలిచిన మెంబర్స్

  • అధ్యక్షుడిగా మంచు విష్ణు
  • జనరల్ సెక్రటరీగా రఘుబాబు
  • వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి
  • ట్రెజరర్‌గా శివబాలాజీ
  • జాయింట్ సెక్రటరీ గౌతం రాజు

ప్రకాశ్ రాజ్ ప్యాన‌ల్ లో గెలిచిన మెంబర్స్

  • వైస్ ప్రెసిడెంట్‌గా హేమ
  • జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించడంపై పరిశ్రమలోని పలువురు నటీనటులు, విష్ణు స్నేహితులు విషెస్ తెలియజేస్తున్నారు. విష్ణు సోదరి మంచు లక్ష్మి నా తమ్ముడా మజాకా అంటూ ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో తన తమ్ముడు అద్భుతమైన విజయాన్ని సాధించి రియల్ హీరో అనిపించుకున్నాడని ట్వీట్ చేసారు. ఇక యంగ్ డైరెక్టర్ హరీష్‌శంకర్‌ కూడా మంచు విష్ణుతో పాటు ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పారు.

Also Read:  EMK సమంత ప్రొమో వచ్చేసింది.. తారక్ అలా అనగానే సామ్ సీరియస్

హేమ కోరకడంతో శివబాలాజీకి గాయం.. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!