Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: EMK సమంత ప్రొమో వచ్చేసింది.. తారక్ అలా అనగానే సామ్ సీరియస్

టాలీవుడ్ టైగర్ నందమూరి తారక రామారావు వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న షో 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు'. సామాన్యుల‌తో పాటు, అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ షోలో కనిపిస్తున్నారు.

Samantha: EMK సమంత ప్రొమో వచ్చేసింది.. తారక్ అలా అనగానే సామ్ సీరియస్
Emk Samantha Promo
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 10, 2021 | 5:45 PM

టాలీవుడ్ టైగర్ నందమూరి తారక రామారావు వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రిస్తోన్న షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’. సామాన్యుల‌తో పాటు, అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ షోలో కనిపిస్తున్నారు. హీరోయిన్ స‌మంత ఈ నవరాత్రి సందర్భంగా ఈ షోలో మెరవబోతున్నారు. పండుగ స్పెషల్ నేపథ్యంలో ఈ నెల 14న జెమినీ టీవీలో స‌మంత స్పెష‌ల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా షో ప్రోమో రిలీజ్ చేశారు.

ఇక ప్రోమో విషయానికి వస్తే..  ఇక్కడ కూర్చుంటే భయంగా ఉంది అని సమంత అనగా.. అది హాట్ సీట్ అలాగే ఉంటుందని తారక్ బదులిచ్చాడు. నాకు డబ్బు వద్దులే అని ఒకసారి.. కావాలి అని మరోసారి సమంత అనడం మీరు చూడవచ్చు.  క్విట్ అయిపోతారా అని ఎన్టీఆర్ అడగ్గా… మీరు ఇప్పుడు చెబుతున్నారు, ముందే చెప్పాలి కదా అంటూ సమంత చిరు కోపం ప్రదర్శించడంతో ప్రోమో ఎండ్ అవుతోంది.

కాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కూడా త్వ‌ర‌లోనే ఈ షోలో క‌నిపించ‌బోతుంద‌ని టాక్. ద‌స‌రా నేపథ్యంలో మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ స్పెష‌ల్ ఎపిసోడ్ ప్ర‌సారంకానుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు… స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవల్

‘మా’ క్లైమాక్స్.. బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో మాములు ట్విస్ట్ ఇవ్వలేదుగా.