R S Shivaji: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత.. తన మూవీ రిలీజైన మరుసటి రోజే..

ప్రముఖ నటుడు ఆర్‌ ఎస్‌ శివాజీ (66) కన్నుమూశారు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పేరుకు తమిళ నటుడే అయినా శివాజీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. పలు డబ్బింగ్‌ సినిమాల్లో నటించారాయన. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శివాజీ పోషించిన కానిస్టేబుల్‌ మాలోకం పాత్ర..

R S Shivaji: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడి కన్నుమూత.. తన మూవీ రిలీజైన మరుసటి రోజే..
R S Shivaji, Kamal Haasan
Follow us

|

Updated on: Sep 02, 2023 | 3:29 PM

ప్రముఖ నటుడు ఆర్‌ ఎస్‌ శివాజీ (66) కన్నుమూశారు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. పేరుకు తమిళ నటుడే అయినా శివాజీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. పలు డబ్బింగ్‌ సినిమాల్లో నటించారాయన. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శివాజీ పోషించిన కానిస్టేబుల్‌ మాలోకం పాత్ర చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో ‘నేను ఎక్కడికో వెళ్లిపోతున్నా’ అని ఆయన చెప్పిన డైలాగ్‌ బాగా ఫేమస్‌. ఇక కమల్ హాసన్‌ నటించిన సినిమాల్లో ఆయన ఎక్కువగా కనిపించారు. అపూర్వ సహోదరులు, మైఖేల్‌ మదన కామరాజు, గుణ, భామనే సత్యభామనే, సత్యమేశివం వంటి సినిమాల్లో కమల్‌తో కనిపించారు. కొన్ని నెలల క్రితం రిలీజైన గార్గి సినిమాలో సాయి పల్లవి తండ్రిగా కనిపించారాయన. అలాగే కమల్ హాసన్‌ సూపర్‌ హిట్‌ విక్రమ్‌ సినిమాలోనూ మెరిశారు. అంతకుముందు సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశమే హద్దుగా మూవీలో కనిపించారు. ఇక చివరిగా యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన లక్కీ మ్యాన్‌లో నటించారాయన. ఇది శుక్రవారం (సెప్టెంబర్‌ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ రిలీజైన మరుసటి రోజే శివాజీ కన్నుమూయడం యాదృఛ్చికం. కేవలం నటుడిగానే కాకుండా అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సౌండ్‌ డిజైన్‌, లైన్‌ ప్రొడక్షన్‌ విభాగాల్లో ఆర్‌ ఎస్‌ శివాజీ పనిచేశారు.

శివాజీతో ఆయన కుటుంబ సభ్యులందరూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు. శివాజీ సోదరుడు సంతాన భారతి నటుడిగానే కాకుండా డైరెక్టర్‌గానూ సత్తా చాటారు. ఇక శివాజీ తండ్రి ఎం ఆర్ సంతానం కూడా కొన్ని సినిమాల్లో నటించారు. కాగా శివాజీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శివాజీ మృతితో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తన సినిమా రిలీజైన మరుసటి రోజే కన్నుమూత

యోగిబాబు లక్కీమ్యాన్ లో ఆర్ ఎజ్ శివాజీ

View this post on Instagram

A post shared by R. S. Shivaji (@26shivaji)

కమల్ హాసన్ తోనే ఎక్కువ సినిమాలు

View this post on Instagram

A post shared by R. S. Shivaji (@26shivaji)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.