Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇప్పుడు నాగ చైతన్య, శోభితా మూడేళ్ల తర్వాత విడిపోతారని జోస్యం చెప్పారు. వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అంతే కాదు వేణు స్వామిపై ఫిర్యాదు దాఖలైంది.

Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి
Venu Swamy
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2024 | 7:57 AM

ఇటీవలే అక్కినేని అందగాడు నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. నాగ చైతన్య గతంలో సమంతను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.. నాగ చైతన్య, సమంత విడిపోతారని గతంలో జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇప్పుడు నాగ చైతన్య, శోభితా మూడేళ్ల తర్వాత విడిపోతారని జోస్యం చెప్పారు. వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. అంతే కాదు వేణు స్వామిపై ఫిర్యాదు దాఖలైంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని కంటెస్టెంట్.. హౌస్‌లోకి నందమూరి హీరో ఎంట్రీ..?

అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వేణుస్వామిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, వేణు స్వామి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ..  ‘నేను సోషల్ మీడియాలో సెలబ్రిటీల జాతక విశ్లేషణ చేయను. అయితే ఇంతకుముందు నేను నాగ చైతన్య-సమంతర జాతక విశ్లేషణ చేసాను, అది చెప్పినట్లు జరిగింది, అదే జాతక విశ్లేషణలో భాగంగా నేను శోభిత-నాగ చైతన్య జాతక విశ్లేషణ చేసాను. అయితే ఇక నుంచి సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, రాజకీయ విశ్లేషణలు చేయను.. అని అన్నారు వేణుస్వామి.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు కూడా నాగ చైతన్య, శోభిత జాతక విశ్లేషణలపై అసంతృప్తి వ్యక్తం చేశారని, తనకు ఫోన్ చేసి ఈ విషయం మాట్లాడారని వేణు స్వామి తెలిపారు. ఈ విషయాన్ని ఆయనకు క్లారిటీ ఇచ్చాను. ఇకపై ప్రముఖుల జాతకాలను విశ్లేషించను’. ఈ విషయమై మంచు విష్ణుని కలిసి మాట్లాడబోతున్నా అని ఆయన చెప్పుకొచ్చారు. అంతకుముందు, వేణు స్వామి నాగ చైతన్య, సమంతలతో పాటు పలువురు నటీనటుల జాతకాలు విశ్లేషించారు. ప్రభాస్ కు ఇక పై సక్సెస్ రాదు అని ఆయన అన్నారు.. కానీ సలార్, కల్కి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టాడు ప్రభాస్.అలాగే ప్రభాస్ పెళ్లికి కూడా కామెంట్స్ చేశారు. వీటితోపాటు ఆంధ్రా అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మరోసారి భారీ మెజార్టీతో గెలుస్తారని రాజకీయ విశ్లేషణలు కూడా చేశారువేణు స్వామి. కానీ జగన్ పార్టీ ఓడిపోయింది. అనంతరం వీడియో అప్‌లోడ్ చేసిన వేణు స్వామి.. ఇక నుంచి రాజకీయనాయకుల జాతకాన్ని విశ్లేషించను చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!