చేసింది ఒక్క సినిమా.. అది కూడా ఫ్లాప్.. కట్ చేస్తే కోట్లు పెట్టి లగ్జరీకారు కొన్న హీరోయిన్

బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తోంది. శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా 'హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

చేసింది ఒక్క సినిమా.. అది కూడా ఫ్లాప్.. కట్ చేస్తే కోట్లు పెట్టి లగ్జరీకారు కొన్న హీరోయిన్
Khushi Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2024 | 8:17 AM

అందాల తార శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఓ సినిమా చేస్తోంది. శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా ‘హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 2023లో ఖుషీ కపూర్ మొదటి సినిమా ‘ది ఆర్చీస్’ విడుదలైంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఈ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇది కూడా చదవండి : Bigg Boss 8: బిగ్ బాస్ సీజన్ 8లో ఊహించని కంటెస్టెంట్.. హౌస్‌లోకి నందమూరి హీరో ఎంట్రీ..?

అయితే మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఖుషీ కపూర్ పెద్దగా బాధపడలేదు.  ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ జీ  క్లాస్ 400 కొనుగోలు చేసింది. దీని ధర దాదాపు 2.55 కోట్ల రూపాయలు.ఈ ముద్దుగుమ్మ కొత్త కారులో షికారు చేస్తోన్న వీడియో వైరల్‌గా మారింది. లగ్జరీ ఎస్‌యూవీని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారు స్పెషాలిటీ ఏంటంటే.. ఈ కారులో ఐదు సీట్లు ఉంటాయి. ఈ కారులో మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏబీఎస్, అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఈ కారులో 2925 సీసీ ఇంజన్ ఉంది.

ఇది కూడా చదవండి : Venu Swamy: ఇక పై సినిమా సెలబ్రిటీల జాతకాలు చెప్పను.. వీడియో వదిలిన వేణు స్వామి

అయితే ఇది ఖుషీ కపూర్ కొనుక్కొని ఉండకపోవచ్చు ఆమె తండ్రి గిఫ్ట్ ఇచ్చాడు అనుకుంటా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్టు 13మా ఖుషీ కపూర్ తల్లి శ్రీదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కారును కొనుగోలు చేయడం విశేషం. ఇక జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ‘ది ఆర్చీస్’ చిత్రంలో ఖుషీ కపూర్ నటించింది. సుహానా ఖాన్, అగస్త్య నందా సహా పలువురు ప్రముఖులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.ఇదిలా ఉంటే ఖుషీ కపూర్ వేదంగ్ రైనాతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..