TOP9 ET: నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌ - మహేష్ | నిర్మాత కారణంగా చిక్కుల్లో సూర్య, విక్రమ్.!

TOP9 ET: నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌ – మహేష్ | నిర్మాత కారణంగా చిక్కుల్లో సూర్య, విక్రమ్.!

Anil kumar poka

|

Updated on: Aug 14, 2024 | 1:47 PM

నిహారిక కోసం అటు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు. కంటెంట్‌ బాగుంటే చాలు.. తమ సైడ్‌ నుంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చే వీరిద్దరూ ఇప్పుడు నీహారిక కమిటీ కుర్రాళ్ల సినిమాను మెచ్చుకున్నారు. నిర్మాతగా నిహారిక చేసిన మంచి ప్రయత్నాన్ని కొనియాడారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్లు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.

01.kamiti kurrallu: నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌ – మహేష్

నిహారిక కోసం అటు మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగారు. కంటెంట్‌ బాగుంటే చాలు.. తమ సైడ్‌ నుంచి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చే వీరిద్దరూ ఇప్పుడు నీహారిక కమిటీ కుర్రాళ్ల సినిమాను మెచ్చుకున్నారు. నిర్మాతగా నిహారిక చేసిన మంచి ప్రయత్నాన్ని కొనియాడారు. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్లు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది.

02.kanguva: నిర్మాత కారణంగా చిక్కుల్లో సూర్య, విక్రమ్.. కోటి రూపాయలు ఫైన్.

నిర్మాత కారణంగా సూర్య కంగువ, విక్రమ్‌ తంగలాన్ సినిమాలు చిక్కుల్లో పడ్డాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ జ్ఙానవేల్ రాజా గతంలో ఓ ఇన్‌వెస్టర్ దగ్గర అప్పు తీసుకోవడం.. ఆ ఇష్యూ కాస్త మద్రాస్‌ హైకోర్టు వరకు చేరడంతో.. గతంలో మద్రాస్‌ హైకోర్ట్ ఓ తీర్పునిచ్చింది. ఈ వివాదం ముగిసే వరకు .. జ్ఙానవేల్ రాజా సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చని.. అయితే తన సినిమా రిలీజ్‌లకు ముందు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందంటూ తీర్పు నిచ్చింది. ఇక ఆ తీర్పు ప్రకారంగా.. తంగలాన్ , కంగువ రిలీజ్‌కు ముందే.. కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంది.

03.vijay: ఉన్న కార్లు అమ్మేసి లగ్జరీ కార్‌ కొన్న స్టార్ హీరో.

ఇటీవల తన దగ్గరున్న రెండు లగ్జరీ కార్లను అమ్మేసి.. కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్ అయ్యారు విజయ్‌ దళపతి. తన కొత్త పార్టీ ఫండ్‌ కోసమే ఇలా చేసి ఉంటారని టాక్ వచ్చేలా చేసుకున్నారు. దళపతి ఫ్యాన్స్ అయితే విజయ్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఫీల్ కూడా అయ్యారు. కానీ కట్ చేస్తూ.. అలా అనుకున్న వారందరికీ దిమ్మతిరిగే షాకిచ్చాడు విజయ్ దళపతి. ఉన్నట్టుండి. ఓ నయా లగ్జరీ కార్‌ కొనేశారు. తాజాగా 2 కోట్ల విలువైన లెక్సెస్‌ కార్‌లో షికార్‌ చేస్తూ..మీడియా కంటికి కూడా చిక్కారు. దీంతో ఉన్న కార్లను అమ్మేసి.. లగ్జరీ కార్‌ కొన్న ఈ స్టార్ హీరో తీరును ఓ వర్గం నెటిజన్స్‌ ట్రోల్స్ చేస్తున్నారు.

04.hareesh: ‘పుష్ప’ చూసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులందరూ స్మగ్లింగ్‌ చేయట్లేదు కదా.?

సినిమాల ప్రభావం ప్రజలపై ఉంటుందా లేదా? అనే చర్చ ఇప్పుడు నెట్టింట యమా జోరుగా సాగుతోంది. అయితే ఈ చర్చలో లేటెస్ట్‌గా హరీష్ శంకర్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమాల ఎఫెక్ట్‌ ప్రజలపై కొన్ని గంటలు మాత్రమే పని చేస్తుందన్న హరీశ్‌ శంకర్ .. నిజంగా సినిమా చూసి మనుషులు మారిపోతారంటే.. ‘పుష్ప’ సినిమా చూసిన ప్రతి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గొడ్డలి పట్టుకొని తిరుపతి వెళ్లి స్మగ్లింగ్‌ చేయాలి కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

05.kalki: కల్కి OTT డేట్ ఫిక్స్?

ప్రభాస్‌ లేటెస్ట్ హిట్.. కల్కి మూవీ పైనే ఇప్పుడు అందరి కళ్లూ ఉన్నాయి. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ గురించే వాకబ్‌ చేయడాలు ఎక్కువవుతున్నాయి. ఇక ఈక్రమంలోనే ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఆగస్ట్ 23 అంటూ ఓ అన్‌ అఫీషియల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు.. నెట్‌ఫిక్స్‌ కూడా ఈ మూవీని స్ట్రీమ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌ ఏమో అమెజాన్లో.. హిందీ వెర్షన్‌ ఏమో..నెట్‌ఫ్లిక్స్లో అందుబాటులో ఉండనుందని న్యూస్.

06.vijay sethupathi: OTTలో రికార్డులు బద్దలు కొడుతున్న విజయ్‌ సేతుపతి.!

మక్కల్ సెల్వన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమా ఓటీటీ ఫీల్డ్‌ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా జూన్ 14న రిలీజ్‌ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ టాక్ తోనే ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. జులై 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ.. హద్దులు దాటి కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువైంది. 1.5 క్రోర్ స్ట్రీమింగ్ హవర్స్‌తో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. అంతేకాదు ఈ ఏడాది అత్యధిక మంది వీక్షించిన ఇంగ్లీష్‌ వెర్షన్ ఫిల్మ్గా.. మహారాజా రికార్డు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం టాప్ 10 జాబితాలోనే కొనసాగుతోంది.

07.venu swami: వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ షాక్.

సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి బిగ్ ఝలక్ తగిలింది. తెలంగాన మహిళా కమిషన్‌ షాకిచ్చింది. నాగచైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్ తర్వాత వారి జాతకాలను విశ్లేషిస్తూ వేణు స్వామి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. తెలుగు ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్ ఆయనపై సీరియస్ అయింది. తెలంగాణ మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇక ఫిర్యాదును తీసుకున్న మహిళా కమిషన్‌ వేణు స్వామిని ఆగస్ట్‌ 22న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. దీంతో ఈ స్టార్ ఆస్ట్రాలజర్ చిక్కుల్లో పడినట్టైంది.

08.venu: భర్తకి మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన వేణుస్వామి భార్య.

తన భర్త వేణు స్వామి పై.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్.. తెలంగాణ ఉమెన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంపై తాజాగా రియాక్టయ్యారు వేణు స్వామి భార్య శ్రీవాణి. తన భర్తను వెనకేసుకొస్తూ.. జర్నలిస్టుల తీరును తప్పుబడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు. తన భర్త చెప్పిన అంశాల మీద గంటల తరబడి లైవ్ డిబేట్స్ నడిపిన మీరు ఇప్పుడు ఎందుకు తన మీద ఫిర్యాదు చేశారు అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు తను రిలీజ్ చేసిన ఈ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు.

09.shobitha: షారుఖ్‌ను బీట్‌ చేసిన శోభిత

ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ IMDB తాజాగా రిలీజ్ చేసిన ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో నటి శోభిత ధూళిపాళ టాప్‌ 2లో నిలిచారు. సర్‌ ప్రైజింగ్లీ షారుఖ్‌ను వెనక్కి నెట్టి మరీ ఈమె ఈ ఘనత సాధించారు. ఇక ఫస్ట్ ప్లేస్‌లో ముంజ్యా నటి శార్వరి వాఘ్ మరోసారి అగ్రస్థానాన్ని నిలుపుకోగా.. థర్డ్‌ ప్లేస్‌లో షారుఖ్ …. ఆ తర్వాత కాజోల్, జాన్వీ కపూర్ వరుసగా స్థానం సంపాదించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.