Mukesh Khanna: అలాంటి ప్రమోటర్లను కొట్టాలి.. బాలీవుడ్ హీరోలపై ముఖేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్..

గుట్కా, పాన్ మసాలా ప్రోత్సహిస్తూ పలు ప్రకటనల్లో స్టార్ నటులు కనిపించడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు.

Mukesh Khanna: అలాంటి ప్రమోటర్లను కొట్టాలి.. బాలీవుడ్ హీరోలపై ముఖేష్ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
Mukesh Khanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 13, 2024 | 10:28 PM

సాధారణంగా సినీ స్టార్ పలు వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంటారు. కానీ కొందరు బాలీవుడ్ స్టార్స్ మాత్రం పాన్ మసాలా యాడ్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వారిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్కా, పాన్ మసాలా ప్రోత్సహిస్తూ పలు ప్రకటనల్లో స్టార్ నటులు కనిపించడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. ముఖేష్ ఖన్నా అక్షయ్ కుమార్ , షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్ వంటి నటులపై సీరియస్ అయ్యాడు. స్టార్ నటీనటులు భారీ రెమ్యునరేషన్ తీసుకుని ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా.. అలాంటి నటులను పట్టుకుని కొట్టాలి అని అన్నారు. ఇదే విషయాన్ని ఆ సినీ హీరోలతో నేరుగా చెప్పానని అన్నారు.

” నేను అక్షయ్ కుమార్‌ను తిట్టాను. ఆయన ఆరోగ్యంపై అవగాహన ఉన్న వ్యక్తి. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లతో కలిసి ఈ ప్రకటన చేసాడు. ఇలాంటి ప్రకటనలకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తారు. దీనితో మీరు ప్రజలకు ఏమి చెబుతున్నారు? తాము పాన్ మసాలా ప్రమోట్ చేయడం లేదని, కేవలం గింజల పొడి విక్రయిస్తున్నామని చెప్పారు. అయితే వాళ్లు ఏం చేస్తున్నారో కూడా తెలుసు’ అని ముఖేష్ ఖన్నా అన్నారు.

మీరు కింగ్‌ఫిషర్‌ను ప్రచారం చేసారు, అంటే మీరు కింగ్‌ఫిషర్ బీర్‌ను విక్రయిస్తున్నారని అర్థం. అది అందరికీ తెలుసు. వీళ్లంతా ఇలా ఎందుకు ప్రచారం చేస్తారు? వాళ్ల దగ్గర డబ్బు లేదా? మీ దగ్గర డబ్బులు సరిపోతాయని, అలాంటి పనులు చేయవద్దని కూడా ఆ నటులకు చెప్పాను. అందులోంచి బయటకి వచ్చిన నటీనటులు తక్కువే. వారిలో అక్షయ్ కుమార్ ఒకరు. నా సమాచారం సరైనదైతే, అమితాబ్ బచ్చన్ కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రకటనల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీరు గుట్కా తినమని ప్రజలకు నేర్పుతున్నారు’ అని ముఖేష్ ఖన్నా ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు ముఖేష్ ఖన్నాకు కూడా అలాంటి ప్రకటనల కోసం ఆఫర్ వచ్చింది. కానీ అతను దానిని తిరస్కరించాడు. ‘శక్తిమాన్’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా సూపర్‌హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్న నటుడు. చాలా విషయాలపై నేరుగా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.