Shah Rukh Khan: షారుఖ్ సంచలన నిర్ణయం.. కూతురు కోసం బరువు తగ్గనున్న స్టార్ హీరో.. కారణం అదే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్న రూమర్ ప్రకారం.. కూతురి కోసం షారుఖ్ బరువు తగ్గనున్నాడ. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖాన్ వెల్లడించాడు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న 'లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్'కి షారూఖ్ వెళ్లాడు. అక్కడ అతనికి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కంటెంట్ నచ్చితే ఎలాంటి రిస్క్ చేయడానికైనా రెడీగా ఉంటాడు. ఇప్పటికే కొన్ని సినిమాల కోసం బరువు పెరిగి, తగ్గాడు. కానీ ఇప్పుడు తన కూతురు సినిమా కోసం బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీటౌన్ లో ఇదే హాట్ టాపిక్. అయితే దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్న రూమర్ ప్రకారం.. కూతురి కోసం షారుఖ్ బరువు తగ్గనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖాన్ వెల్లడించాడు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ‘లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్’కి షారూఖ్ వెళ్లాడు. అక్కడ అతనికి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవల ఆధారంగా ఈ గౌరవం లభించింది. ఈ సన్మానం పొందేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈసారి తదుపరి సినిమా గురించిన సమాచారం ఇచ్చాడు.
సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ సినిమాలో నటిస్తానని షారుక్ చెప్పాడు. దీని కోసం అతను బరువు తగ్గనున్నాడ.. ‘యాక్షన్ సినిమాలు చేయడం కష్టం. మీరు అభ్యాసం, నేర్చుకోవాలి. దీంతో పాటు ప్రమాదకర విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. మాతో పాటు చాలా మంది నిష్ణాతులైన టెక్నీషియన్లు ఉన్నారు. అయితే, 80% ప్రయత్నం మనమే చేయాలి. లేదంటే సరిగ్గా కనిపించదు’ అని షారుక్ అన్నారు. ‘నేను చేస్తున్న తదుపరి చిత్రం కింగ్. ఈ మూవీ పనులు ప్రారంభించాల్సి ఉంది. కాస్త బరువు తగ్గాలి’ అన్నాడు. ఈ అవార్డు ఇచ్చిన వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్ ఖాన్ కు వందల కొద్దీ అవార్డులు ఉన్నాయి.
చాలాకాలం పాటు వరుస ప్లాపులతో సతమతమైన షారుఖ్ ఖాన్.. గతేడాది జవాన్, పఠాన్, డంకీ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈ చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ప్రస్తుతం కింగ్ చిత్రంలో నటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.