AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 Movie : దూసుకుపోతున్న ‘ఎఫ్ 3’.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు అనిల్ రావిపూడి. లేటెస్ట్ గా ఎఫ్ 3 సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు అనిల్.

F3 Movie : దూసుకుపోతున్న 'ఎఫ్ 3'.. రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే..
F3
Rajeev Rayala
|

Updated on: May 29, 2022 | 4:05 PM

Share

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు అనిల్ రావిపూడి(Anil Ravipudi). లేటెస్ట్ గా ఎఫ్ 3(F3 Movie )సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు అనిల్. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గతంలో వచ్చిన ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీ వచ్చింది. ఎఫ్ 2 కు మించి ఈ సినిమాలో కామెడీ ఉండటంతో ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఎఫ్ 3 సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్లు తమన్నా భాటియా – మెహ్రీన్ పాత్రలు కూడా వినోదభరితంగా ఉన్నాయని సినిమా చూసినవాళ్లు అంటున్నారు.

ఇక ఈ సినిమాలో సీన్ సీన్‌కి.. స్క్రీన్ మీద పేలుతున్న పంచులకీ.. ఫన్ ఫుల్గా ఫీలవుతున్నారు ఇదే ఆడియన్స్. ఎఫ్ 2′ సినిమాలోని ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ను ఈసారి ‘ఎఫ్ 3’ లో డబ్బు నేపథ్యంలో చూపించారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా ఫస్ట్ డే నే మంచి వసూళ్లతో సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఎఫ్ 3 రూ. 10.37 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే యూఎస్ఏలో గురువారం ప్రీమియర్లతో సహా మొదటి రోజు రూ. 500 కే డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇక రెండో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత వసూల్ చేసిందట.. నైజాం 4.1 కోట్లు.. UA 1.05 కోట్లు ..సీడెడ్ 1.15 కోట్లు ..గుంటూరు 54 ఎల్ .. నెల్లూరు 24 ఎల్ .. కృష్ణ 51 ఎల్.. వెస్ట్ 29 ఎల్.. తూర్పు 52 ఎల్.. వసూలైంది. 2వ రోజు మొత్తం AP/TS షేర్ : 8.4 కోట్లుగా నమోదైంది. మొత్తం 2 రోజులు కలుపుకుని AP/TS షేర్ 18.77 కోట్లకు చేరుకుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి

Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..