Ante Sundaraniki: నాని ‘అంటే సుందరానికి’ నుంచి నజ్రియా క్యూట్ వీడియో..

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం అంటే సుందరానికి.. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానిది.

Ante Sundaraniki: నాని 'అంటే సుందరానికి' నుంచి నజ్రియా క్యూట్ వీడియో..
Nazriya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 29, 2022 | 3:44 PM

నేచురల్ స్టార్ నాని(Nani)నటిస్తున్న తాజా చిత్రం అంటే సుందరానికి(Ante Sundaraniki).. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానిది. ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ  రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ను రూపొందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం ఈ చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్‌తో సందడి చేస్తోంది. ఈ సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాతో నటించిన నజ్రియా నజీమ్ మొదటి సారి తెలుగులో నటిస్తుంది. నాని .. నజ్రియా .. నదియా కాంబినేషన్లోని సీన్స్ కు సంబంధించిన బ్లూపర్స్ ను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే ఈ సినిమా షూటింగ్ ఎంత సరదాగా జరిగిందనేది అర్థమవుతుంది. నజ్రియా క్యూట్ గా పొరపాటు చేసినప్పుడు  టీమ్ నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే ఈ బ్లూపర్స్ నవ్వుకునేలా ఉన్నాయి. ఈ వీడియో తోపాటు రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రానున్న విషయాన్ని మరోసారి గుర్తుకు చేసింది. నరేశ్.. నదియా .. రోహిణి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి

Bhanu Chander: రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సీనియర్ హీరో.. ఆ సినిమా డబ్బింగ్ చెబుతున్నప్పుడే అర్థమైందంటూ..

Nayanthara Vignesh: నయన్, విఘ్నేష్ పెళ్లి కార్డు రెడీ ?.. సోషల్ మీడియాలో వైరలవుతున్న పెళ్లి పత్రిక..

Singeetam Srinivasa rao: లెజండరీ డైరెక్టర్ ఇంట విషాదం.. సింగీతం శ్రీనివాస రావుకు సతీ వియోగం..