AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

venkatesh drishyam 2 : జూన్ లో రానున్న విక్టరీ వెంకటేష్ దృశ్యం 2.. ఓటీటీలోనా.. లేక థియేటర్స్ లోనా..?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే  షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకీ. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన అసురన్

venkatesh drishyam 2 : జూన్ లో రానున్న విక్టరీ వెంకటేష్ దృశ్యం 2.. ఓటీటీలోనా.. లేక థియేటర్స్ లోనా..?
Drishyam 2 Ott
Rajeev Rayala
|

Updated on: May 03, 2021 | 8:50 AM

Share

venkatesh drishyam 2 : విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే  షూటింగ్ ను పూర్తి చేసాడు వెంకీ. తమిళ్ లో సూపర్ హిట్ సాధించిన అసురన్ సినిమాకు  ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమాతోపాటు ఎఫ్ 3, దృశ్యం 2 సినిమాలు చేస్తున్నాడు వెంకీ. వీటిలో దృశ్యం 2 కు సురేశ్ బాబు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు. అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ నడుస్తుంది. దృశ్యం 2 ను మొదటి నుండి కూడా జూన్ లో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. అన్నట్లుగానే జూన్ లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నారట. అయితే అది ఓటీటీలో అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది కాబట్టి ఓటీటీలో విడుదల చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందో లేక థియేటర్స్ లో దర్శనమిస్తుందో..చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sai Pallavi : క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో అందాల భామ సాయిపల్లవి జతకట్టనుందా..?

Thank you: డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న నాగచైతన్య సినిమా.. ‘థాంక్యూ’ మూవీ స్టోరీ ఇదేనా..?

Anchor Anasuya: ఇద్దరు పిల్లల తల్లైనా.. కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో కుర్రకారు మతిపోగొడుతున్న అనసూయ