Matka OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం మట్కా. పలాస ఫేమ్ కరుణాకర్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లో లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ అందాల తార నోరా ఫతేహి మరో కీలక పాత్రలో మెరిసింది.

Matka OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వరుణ్ తేజ్ మట్కా.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Matka Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 30, 2024 | 3:36 PM

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం మట్కా. పలాసతో అందరి దృష్టి ఆకర్షించిన డైరెక్టర్ కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న మీనాక్షి చౌదరి ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ బాహుబలి ఫేమ్ నోరా ఫతేహి మరో కీలక పాత్రలో మెరిసింది. రిలీజ్ కు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ సినిమాపై అమితాసక్తిని కలిగించాయి. వరుణ్ సినిమాపై పాజిటివ్ హైప్ ను క్రియేట్ చేశాయి. ఇలా భారీ అంచనాల నడుమ నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన మట్కా మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా నెగెటివ్ గా వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ మట్కా రిలీజ్ అయినప్పటికీ పెద్దగా వసూళ్లు తెచ్చుకోలేకపోయింది. దీంతో వరుణ్ ఖాతాలో మరో ఫ్లాప్ చేరిపోయింది. థియేటర్లలో ఆడియెన్స్ ను నిరుత్సాహపరిచిన మట్కా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 05 నుంచి మట్కా సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా మట్కా సినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మట్కా సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

కాగా థియేటర్లలోకి వచ్చిన మూడు వారాలకే మట్కా సినిమా ఓటీటీలోకి రానుంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన మట్కా సినిమాలో నవీన్ చంద్ర, నోరా ఫతేహీ, జాన్ విజయ్, సత్యం రాజేష్, రవి శంకర్, సలోని, అజయ్ ఘోష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు చూసే వారు మట్కా సినిమాపై ఒక లుక్కేసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..

మట్కా సినిమాలో వరుణ్ తేజ్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..