AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Matka Movie Review: మట్కా మూవీ రివ్యూ.. వరుణ్ తేజ్ ఇప్పటికైనా హిట్ కొట్టాడా.?

మెగా హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా మట్కా. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా నేపథ్యం అంతా 1950-80స్ మధ్యలో సాగుతుంది.

Matka Movie Review: మట్కా మూవీ రివ్యూ.. వరుణ్ తేజ్ ఇప్పటికైనా హిట్ కొట్టాడా.?
Matka
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Nov 14, 2024 | 5:30 PM

Share

మెగా హీరో వరుణ్ తేజ్, విలక్షణ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా మట్కా. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా నేపథ్యం అంతా 1950-80స్ మధ్యలో సాగుతుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: మట్కా

నటీనటులు: వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, నోరా ఫతేహీ, జాన్ విజయ్, సత్యం రాజేష్, రవి శంకర్, సలోని తదితరులు

ఇవి కూడా చదవండి

సినిమాటోగ్రఫీ: ఏ కిషోర్

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

సంగీతం: జివి ప్రకాష్ కుమార్

కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: కరుణ కుమార్

నిర్మాత: వైరా ఎంటర్టైన్మెంట్స్

కథ:

1957లో అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్లకు వైజాగ్‌కు అమ్మతో పాటు వస్తాడు వాసు (వరుణ్ తేజ్). ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్తాడు. అక్కడ జైలర్ (రవిశంకర్) వాసును అడ్డు పెట్టుకుని డబ్బు బాగా సంపాదిస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. వైజాగ్‌లోనే పూర్ణ మార్కెట్‌లో పని చేసుకుంటాడు. అక్కడ్నుంచి వాసు జీవితం ఎలా మారిపోయింది..? అతడి జీవితంలోకి సుజాత (మీనాక్షి చౌదరి) ఎలా వచ్చింది..? ఆమె వల్ల వాసు జీవితం ఏమైంది..? వైజాగ్‌లోని పవర్ ఫుల్ వ్యక్తులైన కేబి (జాన్ విజయ్), నాని బాబు (కిషోర్ కుమార్ జి)తో వాసు ఎందుకు గొడవ పడ్డాడు అనేది మిగిలిన కథ..

కథనం:

ఈ మధ్య పీరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాలకు గిరాకీ బాగా పెరిగిపోయింది. అందుకే దర్శకులు అంతా అదే కథల వైపు అడుగులు వేస్తున్నారు. కరుణ కుమార్ కూడా అలాంటి కథనే రాసుకున్నాడు. ముఖ్యంగా 60 ఏళ్ళ కింద మన దేశంలోని పరిస్థితులను తీసుకుని ఈ కథ రాసుకున్నాడు. దానికి సెటప్ కూడా బాగానే చేసుకున్నాడు. కానీ స్క్రీన్ ప్లే విషయంలోనే అసలు సమస్యలన్నీ వచ్చాయి. కొన్ని కథలు హీరోలను భలే బురిడి కొట్టిస్తాయి. ఆ కథ వింటున్నంత సేపు ఓ మైకంలో ఉండిపోతారు.. ఇది మా కెరీర్‌ను మార్చేస్తుందనుకుంటారు. బహుశా మట్కా కథ విన్నపుడు వరుణ్ తేజ్‌కు కూడా ఇదే ఫీల్ కలిగి ఉంటుంది.. అందుకే విడుదలకు ముందు మట్కా గురించి చాలా నమ్మకంగా కనిపించాడు వరుణ్. ఆయన నమ్మకంలో తప్పు లేదు కానీ దర్శకుడు తీసిన విధానంలోనే లోపాలున్నాయి. కథ ఒక్కటే 1950-80స్ మధ్యలో నడుస్తుందనుకుంటాం కానీ టేకింగ్ కూడా అక్కడే ఆగిపోయింది. అడుగడుగునా కేజీయఫ్ రేంజ్ ఎలివేషన్ సీన్స్ రాసుకున్నాడు కానీ వర్కవుట్ అవ్వలేదు. ఇదేం తెలియని కథ కాదు.. ఓ కుర్రాడు సమాజంపై కోపంతో, కసితో డబ్బు సంపాదించాలనుకుంటాడు..

వ్యక్తిగా మొదలై.. వ్యవస్థగా మారి.. ఇండియన్ ఎకానమీనే శాసిస్తాడు. వింటుంటే భలే కిక్ అనిపించే కథ ఇది.. అందుకే ఈ కథ చేయడంలో వరుణ్ తేజ్ తప్పేం లేదేమో అనిపిస్తుంది. ఇలాంటి కిక్ ఇచ్చే కథను.. అంతకంటే కిక్ ఇచ్చేలా తెరకెక్కించాలి. అందులో కరుణ కుమార్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 1,2,3 రాసుకున్నట్లు.. సినిమా మొదలైనపుడే చివరి సీన్ చెప్పేంత రొటీన్ స్క్రీన్ ప్లే మట్కాకు మైనస్. అరే భలే ఉందిరా ఈ సీన్ అనిపించేలా ఒక్కటి కూడా లేదు. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేదు.. రెండూ నీరసంగానే సాగాయి. క్లైమాక్స్ అయితే మరీ రొటీన్.

నటీనటులు:

వరుణ్ తేజ్ తన వరకు ప్రాణం పెట్టాడు.. వాసు పాత్రలో అదరగొట్టాడు. మూడు విభిన్నమైన గెటప్స్, భిన్నమైన ఏజ్ గ్రూప్ ఉన్న పాత్రల్లో బాగా నటించాడు కూడా. ఎమోషనల్ సీన్స్‌లోనూ బాగున్నాడు. మీనాక్షి చౌదరి ఎప్పట్లాగే చిన్న పాత్రలోనే కనిపించింది. సలోని మరో కీలక పాత్రలో నటించింది. నవీన్ చంద్ర, నోరా ఫతేహీ, జాన్ విజయ్, సత్యం రాజేష్, రవి శంకర్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

జీవి ప్రకాశ్ కుమార్ పాటలు పర్లేదు కానీ RR ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా వరకు సీన్స్ అన్నీ బాగానే హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదేమో..? ఎందుకంటే సినిమాలో పెద్దగా ఆసక్తి కలిగించే సన్నివేశాలేం లేవు. అయినా దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటింగ్‌ను తప్పుబట్టలేం. కరుణ కుమార్ తనకు వచ్చిన మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా మట్కా.. కిక్ ఇవ్వని గేమ్..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు