Kantara movie: సినిమా విడుదలైన ఇన్నాళ్లకు యూట్యూబ్లోకి వచ్చిన ‘కాంతార’ సాంగ్.. ట్రెండింగ్లో ‘వరహారూపం’ పాట..
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగులో విడుదలై అంతకు మించి అనేలా హిట్ అందుకుంది. కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి సహజ నటనకు విమర్శలు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ ఎంత హిట్టయిందో చెప్పక్కర్లేదు. యూట్యూబ్లో నెంబర్ వన్ గా దూసుకుపోయింది.

ఈ మధ్య టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పరభాష చిత్రాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండానే తెలుగులో విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. తెలుగుతోపాటు.. మిగతా భాషల్లోనూ మంచి రెస్పాన్స్ అందుకుంటూ భారీగా వసూళ్లు రాబట్టాయి. అటు మ్యూజిక్ పరంగానూ సెన్సెషన్ సృష్టించిన చిత్రాలు ఉన్నాయి అందులో కాంతార ఒకటి. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆ తర్వాత తెలుగులో విడుదలై అంతకు మించి అనేలా హిట్ అందుకుంది. కన్నడ నటుడు కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి సహజ నటనకు విమర్శలు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలోని క్లైమాక్స్ సాంగ్ ఎంత హిట్టయిందో చెప్పక్కర్లేదు. యూట్యూబ్లో నెంబర్ వన్ గా దూసుకుపోయింది.
అయితే విజయంతోపాటు.. వివాదాలు కూడా ఈ చిత్రం చుట్టూ ఏర్పడ్డాయి. ఈ సినిమాకు హైప్ తీసుకువచ్చిన వరహారూపం సాంగ్ ట్యూన్ కాపీ చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్ట్ సినిమా నుంచి మాత్రమే కాదు అన్ని సోషల్ మీడియా ఫార్మాట్స్ నుంచి ఈ సాంగ్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సాంగ్ అన్ని సోషల్ మీడియా ఫార్మాట్స్ నుంచి డెలీట్ చేశారు. అయితే ఈ వరహారూపం పాట ఇప్పటివరకు లిరికల్ సాంగ్ మాత్రమే అందుబాటులో ఉండేది. తాజాగా ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది పూర్తైన సందర్భంగా పూర్తి వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ పాట ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
Let’s relive the magic and experience the essence of the divine!#VarahaRoopam: https://t.co/Mv4SPKOArG#1YearOfDivineBlockbusterKantara #1YearOfKantara#Kantara @shetty_rishab @VKiragandur @gowda_sapthami @actorkishore @AJANEESHB @saivigneshsings @ShashirajKavoor @KantaraFilm
— Hombale Films (@hombalefilms) September 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.







