Ajith Valimai: బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వలిమై.. ఆ స్టార్ హీరో సినిమాలను అజిత్ మూవీ బీట్ చేసిందట..

స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.. తమిళనాట భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న అజిత్ సినిమా విడుదల అంటే మాములుగా ఉండదు.

Ajith Valimai: బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వలిమై.. ఆ స్టార్ హీరో సినిమాలను అజిత్ మూవీ బీట్ చేసిందట..
Ajith Valimai
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 27, 2022 | 9:42 AM

Ajith Valimai: స్టార్ హీరో అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.. తమిళనాట భారీ ఫ్యాన్ పాలోయింగ్ ఉన్న అజిత్ సినిమా విడుదల అంటే మాములుగా ఉండదు. థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. ఇక  రీసెంట్‌గా వలిమై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్. జీ స్టూడియోస్‌తో క‌లిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ క‌పూర్(Boney Kapoor) ఈ మూవీని నిర్మించగా.. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ చిత్రంలో తెలుగు యాక్టర్  కార్తికేయ(Kartikeya Gummakonda) విల‌న్‌గా న‌టించాడు. హ్యుమా ఖురేషి కీ రోల్ పోషించింది.  ఇక రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్​ నటించిన చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా అంచనాలను అందుకొని సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక తెలుగులోనూ విడుదలైన ఈ మూవీ మనదగ్గర కూడా పాజిటివ్ టాక్ ను రాబట్టింది.

ఇదిలా ఉంటే తమిళనాట అజిత్ వలిమై సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందని తెలుస్తుంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదలైంది. మొదటి రోజునుంచే వలిమై బాక్సాఫిస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లి రోజున ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ నుంచి 36.17 కోట్లను వసూలు చేసినట్టుగా అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన రోబో 2.O , అన్నత్తే సినిమాల కంటే అజిత్ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికీ థియేటర్స్ దగ్గర వలిమై అదే జోరును కంటిన్యూ చేస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagababu: ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్‌ ఫైర్‌.. పవన్‌పై పగ బట్టిందంటూ ఘాటు విమర్శలు..

Bigg Boss Non-Stop: నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ షురూ.. బిగ్ బాస్ ఓటీటీ హంగామా మొదలైంది.

Bheemla Nayak : పవర్ స్టార్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సూపర్ స్టార్ ప్రసంశలు..