Nagababu: ఏపీ ప్రభుత్వంపై మెగా బ్రదర్ ఫైర్.. పవన్‌పై పగ బట్టిందంటూ ఘాటు విమర్శలు..
'భీమ్లానాయక్' సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) దారుణంగా వ్యవహరిస్తోందని నటుడు నాగబాబు (Nagababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) దారుణంగా వ్యవహరిస్తోందని నటుడు నాగబాబు (Nagababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తమ్ముడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రభుత్వం పగ పట్టిందని మండిపడ్డారు. సినిమా టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ జీవో విడుదల చేయడం లేదని.. జీవో విడుదల చేయడంలో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలపాలని ప్రశ్నించారు. పవన్‌పై పగతో ఇలా చేస్తున్నా ఎవరూ నోరు మెదపడం లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు పవన్‌కు మద్దతు ఇవ్వకపోవడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.
‘పవన్ కల్యాణ్ పై పగపట్టి ఇంత చేస్తుంటే ఎవరు నోరు మెదపడం లేదు. సినిమా పెద్దలు కళ్యాణ్ కు మద్దతు ప్రకటించకపోవడం దురదృష్టకరం. నిర్మాతలు, దర్శకులు, హీరోలకు ఇది తప్పు అని చెప్పడానికి ఎందుకు ధైర్యం చాలడం లేదు. ఒక అగ్ర హీరోకే ఇంత జరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటీ. సినీ పరిశ్రమ భయాన్ని, అభద్రతా భావాన్ని పవన్ అర్థం చేసుకుంటున్నాడు. ఏ హీరోకైనా, ఏ నిర్మాతకైనా, ఏ దర్శకుడికైనా ఇలాంటి సమస్య వస్తే మేం ముందుటాం. మీరు మమ్మల్ని వదిలేసినా మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ప్రభుత్వంలోనే ఉండేది ఐదేళ్లేనని వైఎస్సార్‌సీపీ గుర్తించాలి. ప్రజలు మీకు శాశ్వత అధికారం ఇవ్వలేదు. మళ్లీ ప్రజాక్షేత్రంలో నిల్చొని ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి’ అని చెప్పుకొచ్చారు నాగబాబు.
Its High time We people respond to this burning issue and address the elephant in the Room & Show our Support.
Don’t make the history repeat for itself let’s show them we stand by Kalyan Babu & We Wont Back off until the Justice is Served.#IamwithPK I Stand for @PawanKalyan
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 24, 2022
Also Read:Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..
Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!
Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!