Bheemla Nayak: ఇది కదా మాకు కావాల్సింది.. పవర్‌స్టార్‌ సినిమాపై నితిన్‌ ట్వీట్‌..

Bheemla Nayak: వకీల్‌సాబ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన చిత్రం ' భీమ్లానాయక్‌'. దగ్గుబాటి రానా (Daggubati Rana)  మరో హీరోగా నటించగా నిత్యామేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటించారు

Bheemla Nayak: ఇది కదా మాకు కావాల్సింది.. పవర్‌స్టార్‌ సినిమాపై నితిన్‌ ట్వీట్‌..
Pawan And Nithin
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Feb 28, 2022 | 11:21 AM

Bheemla Nayak: వకీల్‌సాబ్‌ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన చిత్రం ‘ భీమ్లానాయక్‌’. దగ్గుబాటి రానా (Daggubati Rana)  మరో హీరోగా నటించగా నిత్యామేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్ర్కీన్‌ ప్లే అందించారు. నిన్న (ఫిబ్రవరి25) రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌ గా రిలీజైన భీమ్లానాయక్ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో పవర్‌స్టార్‌ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డ్యాన్సులు, క‌టౌట్ల‌కు పాలాభిషేకాలు, బాణాసంచా మోతతో థియేట‌ర్ల వ‌ద్ద‌ హోరెత్తిస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రామ్‌ గోపాల్‌ వర్మ, హరీశ్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, ప్రిన్స్‌ మహేశ్‌ బాబు.. ఇలా చాలామంది సినీ తారలు ఈ సినిమాను చూసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సినిమా అదిరిపోయిదంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా పవన్‌కి వీరాభిమాని నితిన్‌ భీమ్లానాయక్‌ సినిమాను వీక్షించారు. అనంతరం తన అభిప్రాయాలను ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ‘ఇది కదా మాకు కావలసింది. పవన్‌కల్యాణ్‌ విధ్వంసం సృష్టించారు. రానా ఇరగొట్టావ్‌.. తమన్‌ మ్యూజిక్‌లో ఫైర్‌ ఉంది. త్రివిక్రమ్‌, సాగర్‌ చంద్రకు కృతజ్ఞతలు’ అంటూ సినిమా యూనిట్‌కు కంగ్రాట్స్‌ తెలిపారు. ఈ ట్వీట్‌పై అటు పవన్‌ అభిమానులు, ఇటు నితిన్‌ అభిమానులు తెగ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!

IIPS Mumbai Jobs: ఐఐపీఎస్‌లో అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారానే ఎంపికలు..