Bangarraju: ఓటిటిలోనూ దూసుకుపోతున్న బంగార్రాజు.. సరికొత్త రికార్డ్ అందుకున్న సినిమా..
వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ
Bangarraju: వినోదాత్మక సినిమాలు, వెబ్ సిరీస్‌లు డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లతో హిందీ, తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు ఓటీటీలు ఇక సూపర్ హిట్ సినిమాలతో పాటు ఆకట్టుకునే వెబ్ సిరీర్ లను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఇక రీసెంట్ గా సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో అదరగొడుతున్నాయి. వీటిలో కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా ఒకటి.
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు` సోగ్గాడు మళ్ళీ వచ్చాడు’…అనేది ఉపశీర్షిక. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది.ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి ”జీ 5′ లో విడుదల చేసిన విషయం తెలిసిందే.. జీ5 లో ప్రసారమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ విడుదలైన 7 రోజుల్లో 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో బంగార్రాజు బ్లాక్‌బస్టర్‌గా నిలవడం మాకెంతో అననందాన్ని ఇచ్చిందని ట్విట్టర్ ద్వారా నాగార్జున, నాగచైతన్య, కృతి శెట్టిలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. కోవిడ్ టైం లో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారని నా శ్రేయో భిలాషులు సలహాలు ఇవ్వడం జరిగింది.అయితే మా “సోగ్గాడే చిన్నినాయన” సినిమాను గతంలో కూడా సంక్రాంతి కి రిలీజ్ చేశాం.. ఆ సెంటిమెంట్ తో కోవిడ్ ఉన్న కూడా మేము ఎంతో ధైర్యం చేసి ఈ సంక్రాంతి కి మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది అన్నారు.అయితే ప్రేక్షకులనుండి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ”జీ 5′.లో విడుదల చేశాం. జీ 5 లో స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లో 500 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఒక సరికొత్త రికార్డ్. ఈ సందర్భంగా బంగార్రాజు ను ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అని చెప్పుకొచ్చారు కింగ్ నాగార్జున.
మరిన్ని ఇక్కడ చదవండి :