Devi Sri Prasad: ఆ దర్శకుడితో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది: దేవీశ్రీ
సంగీతంలో తన కంటూ ప్రత్యేక ముద్ర సృష్టించుకున్న సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. అటు మాస్ సినిమాలకు, ఇటు క్లాస్ సినిమాలకు ఒకేసారి బాణీలు కట్టి శ్రోతల హృదయాలను దోచుకోవడంలో దిట్ట.
Devi Sri Prasad: సంగీతంలో తన కంటూ ప్రత్యేక ముద్ర సృష్టించుకున్న సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. అటు మాస్ సినిమాలకు, ఇటు క్లాస్ సినిమాలకు ఒకేసారి బాణీలు కట్టి శ్రోతల హృదయాలను దోచుకోవడంలో దిట్ట. తాజాగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన సినిమా `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. ఇందులో `మాంగళ్యం తంతునా..` అనే పాట సందర్భాన్ని ఫోన్లో విని వెంటనే ట్యూన్ కట్టేశారు. శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా నటించిన `ఆడవాళ్ళు మీకు జోహార్లు`లో పాటలు ఇప్పటికే ఆదరణ పొందుతున్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రంలోని సంగీతం గురించి, చిత్ర కథకు తన కుటుంబానికి గల అసంబంధాన్ని గురించి పలు విషయాలను పంచుకున్నారు దేవీ.
దేవీశ్రీ మాట్లాడుతూ.. తిరుమల కిషోర్ తో సినిమా చేయడం అంటేనే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అన్నారు. ఆయన చాలా క్రియేటివ్ పర్సన్. కథ చెప్పేటప్పుడే ఎక్కడ పాట రావాలి. ఎక్కడ ట్యూన్ పెట్టాలనేవి వివరిస్తారు. ఆయన చిత్రాలన్నీ సాంగ్స్ బేస్డ్ కథలే. ఆయన సినిమాల్లో ఎమోషన్ తో పాటు ఎంటర్టైన్ మెంట్ కూడా వుంటుంది. `ఆడవాళ్ళు మీకు జోహార్లు` సినిమా కిశోర్ కెరీర్లో బెస్ట్ మూవీ అని చెప్పగలను అన్నారు దేవీ. నేను పాటలు చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. లాక్డౌన్ సమయంలోనే జూమ్లోనే నాకు ఈ కథ చెప్పారు. కథ చెప్పినప్పుడే మూడు, నాలుగు పాయింట్లకు ఐడియా చెప్పాను.` మాంగళ్యం తంతునా ` నేపథ్యం చెప్పగానే వెంటనే ట్యూన్ వచ్చేసింది. ఏదైనా ఆయన కథ చెప్పగానే ఐడియా వచ్చేస్తుంది. అందుకే ఆయనతో కలిసి సినిమా చేయడం చాలా కంఫర్టబుల్గా వుంటుంది. అదేవిధంగా టైటిల్ సాంగ్ అనుకుంటున్నప్పుడు దానికి ఫన్ కలిపితే బాగుంటుందని అనుకోవడం వెంటనే చేయడం జరిగిపోయాయి. వింటే మీకే అర్థమవుతుంది అన్నారు.
శర్వానంద్ నాకు `శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.`నుంచీ తెలుసు. అందులో ఒక పాత్ర వేశాడు. సాంగ్లోకూడా పాల్గొన్నాడు. ఎప్పటినుంచో సినిమా చేయాలని అనుకునేవాళ్ళం. అది కిశోర్ వల్లే కుదిరింది. గోవాలో షూట్ చేస్తుండగా సినిమాపై చాలా చర్చించాం. హ్యాపీగా అనిపించింది అన్నారు అలాగే పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ.. ఏదైనా సినిమాకు సినిమాకు కొత్తదనం వుంటుంది. ‘రంగస్థలం` చేస్తున్నప్పుడు మరోవైపు `భరత్ అనే నేను` చిత్రానికి బ్యాక్గ్రౌండ్ ఒకేసారి చేశాను. అది రూరల్ అయితే, ఇది మోడ్రన్ బేక్డ్రాప్. తప్పకుండా వేరియేషన్ చూపించాలి. ఇక పుష్ప రగ్డ్ సినిమా. ఆడవాళ్ళు మీకు జోహార్లు`కూల్ సినిమా. పుష్ప ప్రమోషన్ టైంలో సుకుమార్ కు ఇందులో పాట వినిపించాను. రెండు లైన్లు విని `డార్లింగ్ సూపర్ హిట్` అని చెప్పేశారు. అనిల్ రావిపూడి, బాబీ ఇలా చాలామంది టైటిల్ సాంగ్ను మెచ్చుకున్నారు అని చెప్పుకొచ్చారు దేవీశ్రీ.
మరిన్ని ఇక్కడ చదవండి :