
పవన్‌కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో గత కొన్ని నెలలుగా ఆయన సినిమా షూటింగులకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇటీవలే మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. తిరిగి షూటింగులలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీని తర్వాత పవన్ ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెట్స్‌లో అడుగుపెట్టారు పవన్. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ మెగాభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఒకరోజు ముందుగానే అంటే నేడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ సూపర్ స్టైలిష్ లుక్ లో కనిపించి అదరగొట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టనున్నారు. తమిళ్ లో దళపతి విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. ఉస్తాద్ లో శ్రీ లీల తో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తుంది. పవర్ స్టార్ నయా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాకు మించి ఉస్తాద్ సినిమా హిట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.
Ustaad of Style, Swag & Box-office 💥💥
Here is the WWM picture ❤🔥
HD picture and DP👇https://t.co/BwMPLMff5V#UstaadBhagatSingh pic.twitter.com/7oYsCVw86H
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) September 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి