Ram Charan: క్లింకారతో సంక్రాంతి సంబరాలు.. గరిటె పట్టి దోశలేసిన రామ్ చరణ్.. వీడియోస్ వైరల్..
తాజాగా ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫోటోస్, వీడియోస్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గరిటె పట్టి దోశలు వేస్తూ కనిపించారు. అలాగే మరొకటి మెగాస్టా్ర్ సతీమణి సురేఖ తన మనవరాలు మెగా ప్రిన్సెస్ క్లింకారాతో ఎంతో సంతోషంగా గడుపుతూ కనిపించారు. గతంలో చిరు సైతం పండగ సందర్భాల్లో దోశలు వేసిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఇప్పుడు సంక్రాంతి పండగను ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. బెంగుళూరులోని తమ ఫాంహౌస్లో ఈఏడాది ఫెస్టివల్ అంతా కలిసి ఒక్కచోట చేరి సరదాగా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఉపాసన షేర్ చేసిన కొన్ని ఫోటోస్, వీడియోస్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గరిటె పట్టి దోశలు వేస్తూ కనిపించారు. అలాగే మరొకటి మెగాస్టా్ర్ సతీమణి సురేఖ తన మనవరాలు మెగా ప్రిన్సెస్ క్లింకారాతో ఎంతో సంతోషంగా గడుపుతూ కనిపించారు. గతంలో చిరు సైతం పండగ సందర్భాల్లో దోశలు వేసిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చరణ్ కూడా దోశలు వేస్తూ కనిపించారు. అయితే చెర్రీకి దోశలు వేయడం తన తల్లి దగ్గరుండి నేర్పించినట్లుగా ఉపాసన షేర్ చేసిన క్యాప్షన్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియోస్, ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ సంక్రాంతికి మెగా మనవరాలు.. కొత్త కోడలు అడుగుపెట్టారు. కుటుంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులు రావడంతో ప్రస్తుతం ఈసారి సంక్రాంతికి ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక నిన్న (జనవరి 13న) పంజా వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.

Ram Charan
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాలో మొదటిసారి చరణ్ రాజకీయ నాయకుడిగా.. ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో వర్క్ చేయనున్నారు చరణ్. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
Officially confirmed pedda boss place ni replace chesina chinna boss 🔥🔥🔥🔥🔥🔥@AlwaysRamCharan#RamCharanpic.twitter.com/Q7Sq8isgpy
— ₵₳₱₮₳ł₦ ł₦Đł₳™ (@Captain_India_R) January 14, 2024
Boss same #RamCharan lage unnaru pic.twitter.com/8SNtfbXHcU
— Hevanth 🌶️ (@TheHevanth) January 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




