AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana Konidela: అమ్మాయిలు అలా చేయడం తప్పా.. ? విమర్శలకు గట్టి కౌంటరిచ్చిన ఉపాసన..

ఇటీవల ఐఐటీ విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించి ఆమె చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ పై జోహో సీఈఓ శ్రీధర్ వెంబు వంటి ప్రముఖులు సహా చాలా మంది నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. తాజాగా మరోసారి తన పోస్ట్ పై వివరణ ఇచ్చారు ఉపాసన.

Upasana Konidela: అమ్మాయిలు అలా చేయడం తప్పా.. ? విమర్శలకు గట్టి కౌంటరిచ్చిన ఉపాసన..
Upasana
Rajitha Chanti
|

Updated on: Nov 20, 2025 | 12:53 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి.. అపోలో సీఎస్ఆర్ వైస్ ఛైర్మన్ ఉపాసన కొణిదెల ఇటీవల చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించిన ఆమె.. ఆ తర్వాత పెళ్లికి సంబంధించి చేసిన పోస్ట్ పై నెట్టింట చర్చ జరిగింది. ఉపాసన పోస్ట్ పై నెటిజన్స్, జోహా సీఈవో శ్రీధర్ వెంబు స్పందించారు. కొందరు ఉపాసన వ్యాఖ్యలను విమర్శించగా.. మరికొందరు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన పోస్ట్ పై మరోసారి స్పందించారు ఉపాసన. తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ సోషల్ మీడియా ఖాతాలో మరో పోస్ట్ చేశారు. అలాగే తన పోస్ట్ పై చర్చ లేవనెత్తినందుకు సంతోషంగా ఉందన్నారు.

“నా పోస్ట్ పై ఆరోగ్యకరమైన చర్చను లేవనెత్తినందుకు ఆనందిస్తున్నాను.. స్పందించిన వారికి థ్యాంక్స్” అంటూ మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఫ్యాక్ట్ చెక్ పేరితో తన వివాహం, సంతానానికి సంబంధించిన ప్లాన్స్ వెల్లడించారు. “ఒక స్త్రీ సమాజ ఒత్తిడికి లొంగిపోయే బదులు ప్రేమ వివాహం చేసుకోవడం తప్పా? సరైన భాగస్వామి దొరికే వరకు వేచి ఉండటం తప్పా? ఒక స్త్రీ తన స్వంత పరిస్థితుల ఆధారంగా పిల్లలను కనాలని ఎప్పుడు ఎంచుకోవాలో అది తప్పా? ఒక స్త్రీ తన లక్ష్యాలను నిర్దేశించుకుని, వివాహం గురించి లేదా చిన్న వయస్సులోనే పిల్లలను కనడం గురించి మాత్రమే ఆలోచించకుండా తన కెరీర్‌పై దృష్టి పెట్టడం తప్పా?” అంటూ ప్రశ్నలు సంధించారు.

“నేను 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. వ్యక్తిగత.. ఆరోగ్య కారణాల వల్ల 29 ఏళ్ల వయసులో నా ఎగ్స్ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. 36ఏళ్ల వయసులో ఓ బిడ్డకు జన్మనిచ్చాను.. ప్రస్తుతం నాకు 39 సంవత్సరాలు. త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నాను. వ్యక్తిగత జీవితానికి ఎంతగా ప్రాధాన్యమిచ్చానో.. కెరీర్ నిర్మాణానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాను. నా దృష్టిలో పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. ప్రతిదానికీ ప్రత్యేక సమయం ఉంటుందని నేను భావిస్తున్నాను ” అని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించిన ఉపాసన.. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. పెళ్లి చేసుకుంటున్నారా ?అనే ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని.. మహిళలు కెరీర్ నిర్మించుకోవడం పై దృష్టి పెట్టారని .. ఇది సరికొత్త భారత్ అంటూ పోస్ట్ చేశారు ఉపాసన. అమ్మాయిలు అండాలు దాచిపెట్టుకోవడమని..దానివల్ల ఎప్పుడు పిల్లలను కనాలన్నది తమ చేతుల్లోనే ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఉపాసన పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..

Follow Us