AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan-Upasana: డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు.. లవ్ మ్యారేజ్ పై ఓపెన్ అయిన ఉపాసన..

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుతున్నప్పుడు చరణ్ వెంటే ఉన్నారట ఉపాసన. ఆ సమయంలో తన భర్తకు మానసికంగా ధైర్యం ఇచ్చానని.. తన భర్త చరణ్ సైతం తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఉపాసన.

Ram Charan-Upasana: డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు.. లవ్ మ్యారేజ్ పై ఓపెన్ అయిన ఉపాసన..
Upasana, Ram Charan
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2023 | 1:28 PM

Share

టాలీవుడ్ మోస్ట్ లవ్‏బుల్ కపుల్స్‏లో రామ్ చరణ్.. ఉపాసన జోడి ఒకటి. హీరోగా అరంగేట్రం చేసిన కొన్నాళ్లకే చరణ్.. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలు ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నారు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరిని ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 2012 జూన్ 14న వీరి వివాహం అంగరంగా వైభవంగా జరిగింది. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇటీవల లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ వేడుకలకు చెర్రీతో కలిసి ఉపాసన కూడా సందడి చేశారు. అంతేకాకుండా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుతున్నప్పుడు చరణ్ వెంటే ఉన్నారట ఉపాసన. ఆ సమయంలో తన భర్తకు మానసికంగా ధైర్యం ఇచ్చానని.. తన భర్త చరణ్ సైతం తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఉపాసన. అంతేకాకుండా.. తన ప్రతి విజయంలో చరణ్ మద్దతుగా ఉన్నాడని.. కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నా తాము.. ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యమన్నారు.

తమ 20 ఏళ్ల బంధంలో ప్రేమలో ఎదగడం రామ్ తనకు నేర్పించాడని.. ఎల్లప్పుడూ తనకు రామ్ మార్గదర్శిగా ఉన్నాడని చెప్పుకొచ్చారు ఉపాసన. ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకలు తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలని తెలిపారు. అంతేకాకుండా.. పెళ్లైన కొత్తలో తాను ఎదుర్కొన్న విమర్శల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే తమ లవ్ మ్యారెజ్ పై ఓపెన్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఉపాసన మాట్లాడుతూ.. “చరణ్ నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం. మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు.. కానీ ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉన్నారు. సమాజంలో చాలా మంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. నా పెళ్లైన కొత్తలో నేను బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొన్నాను.. నేను బాగా లావుగా ఉన్నానని.. అందంగా లేనని.. కామెంట్స్ చేశారు. మరికొందరు చరణ్ కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని అన్నారు. ఆ సమయంలో నేను కుంగిపోలేదు. ధైర్యంగా వాటిని జయించాను. ఆరోజు నన్ను ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.