Unstoppable With NBK 2: ‘అన్ స్టాపబుల్’ దసరా సెలబ్రేషన్స్.. విజయవాడలో బాలయ్య సందడి
నటసింహం ఓటీటీలో దుమ్ముదులుపుతోన్న విషయం తెలిసిందే.. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకునే బాలయ్య. ఇప్పుడు టాక్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
నటసింహం ఓటీటీలో దుమ్ముదులుపుతోన్న విషయం తెలిసిందే.. సినిమాల్లో తన నటనతో ఆకట్టుకునే బాలయ్య. ఇప్పుడు టాక్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హోస్ట్ గా బాలయ్య ఎలా చేస్తారు..? అనే ప్రశ్నలకు అన్ స్టాపబుల్ సీజన్ వన్ సాలిడ్ సమాధానం చెప్పింది. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను తికమకపెడుతూ ఎంతో సరదాగా సాగింది అన్ స్టాపబుల్ సీజన్ వన్. టాక్ షోలన్నింటిలోనూ అన్ స్టాపబులే నెంబర్ వన్ ఉండేలా నిలబెట్టారు బాలకృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజ రవితేజ ఇలా పలువురు స్టార్స్ తో తన మాటలతో.. సరదా సంభాషణలతో ఆకట్టుకున్నారు బాలకృష్ణ. మొదటి సీజన్ ను ఘనవిజయంగా పూర్తి చేసిన ఆహా. ఇప్పుడు సీజన్ 2 తో రావడానికి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుక విజయవాడలో గ్రాండ్ గా జరుగుతోంది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ లో వీక్షించండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..