Rajinikanth: రజినీకాంత్ తండ్రిని ఎప్పుడైనా చూశారా ?.. తండ్రితో సూపర్ స్టార్.. నెట్టింట వైరలవుతున్న రేర్ ఫోటో..
గతేడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రజినీ. ఈ సినిమాకు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న లాల్ సాలమ్ సినిమాలో అదితి పాత్రలో కనిపించనున్నారు రజినీ. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోగా ఎదిగారు రజినీ..ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి… ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అటు తమిళం.. ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 73 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. గతేడాది జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రజినీ. ఈ సినిమాకు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కిస్తున్న లాల్ సాలమ్ సినిమాలో అదితి పాత్రలో కనిపించనున్నారు రజినీ. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.
ఇటీవల సెలబ్రెటీల ఫ్యామిలీ ఫోటోస్.. వారి చిన్ననాటి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తమ అభిమాన తారల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తారల చిన్ననాటి ఫోటోస్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ కు సంబంధించిన ఓ అరుదైన ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అందులో రజినీ తన తండ్రితో కూర్చుని మాట్లాడుతున్నారు. సాధారణంగా రజినీ తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా జనాలకు తెలియదు. ఆయన తండ్రి పేరు రామోజీ రావు.. గైక్వాడ్ పోలీస్ కానిస్టేబుల్. రజినీ బెంగుళూరులో ఓ మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. తొమ్మిదేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు రజినీ.

Rajinikanth Father
సినిమాల్లోకి అడుగుపెట్టకముందు రజినీ బెంగుళూరు ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ లో బస్ కండక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే రజినీ తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఫోటో ఇప్పటివరకు ఎక్కడ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం తన తండ్రితో కలిసి కూర్చుని సూపర్ స్టార్ ముచ్చటిస్తున్న ఫోటో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. లాల్ సలామ్ సినిమా తర్వాత రజినీ.. జ్ఞానవేల్ దర్శకత్వంలో వేడియాన్ చిత్రంలో నటించనున్నారు. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు రజినీ.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




