AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal Movie: మాటకు మాట.. డైరెక్టర్ సందీప్ రెడ్డి కామెంట్స్ పై అమీర్ ఖాన్ మాజీ భార్య కౌంటర్..

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించారు. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడి జీవితమే ఈ చిత్రం. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. అయితే ఇప్పటికే ఈ మూవీపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ అనేకమంది తారలు ఈ మూవీపై మండిపడ్డారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావు సైతం ఈ మూవీ గురించి పరోక్షంగా స్పందించారు.

Animal Movie: మాటకు మాట.. డైరెక్టర్ సందీప్ రెడ్డి కామెంట్స్ పై అమీర్ ఖాన్ మాజీ భార్య కౌంటర్..
Kiran Rao, Sandeep Reddy Va
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2024 | 8:34 AM

Share

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. భారీ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాజిటివ్ రెస్పాన్స్ ఏ స్థాయిలో వచ్చిందో.. అదే రేంజ్‏లో విమర్శలు ఎదుర్కొన్న సినిమా ‘యానిమల్’. గతేడాది విడుదలై దాదాపు రూ. 900 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీలోనూ దూసుకుపోతుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించారు. తండ్రి ప్రేమ కోసం ఆరాటపడే కుర్రాడి జీవితమే ఈ చిత్రం. ఇందులో అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలు పోషించారు. అయితే ఇప్పటికే ఈ మూవీపై సినీ ప్రముఖులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. సౌత్ టూ నార్త్ అనేకమంది తారలు ఈ మూవీపై మండిపడ్డారు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావు సైతం ఈ మూవీ గురించి పరోక్షంగా స్పందించారు. ఇందులో స్త్రీ విద్వేషం..వయోలెన్స్ విపరీతంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆమె మాటలకు డైరెక్టర్ సందీప్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. తన సినిమాల గురించి మాట్లాడేందుకు ముందు తన మాజీ భర్త అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాను చూడాలని అన్నారు. ఖంబే జైసీ ఖాదీ హై వంటి పాటలు ఉన్న అమీర్ ఖాన్ చిత్రాలను చూడాలని అన్నారు. ఆ తర్వాత తన సినిమాలపై కామెంట్స్ చేయాలని అన్నారు. ఆ సినిమాలో హీరోయిన్ పై దాడి చేయడం.. దాదాపు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఆమెనే తిరిగి తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. చివరకు ఆమె అదే హీరో ప్రేమలో పడుతుంది. అదంతా ఏమిటీ ? అంటూ కౌంటరిచ్చాడు. తాజాగా సందీప్ కామెంట్స్ పై స్పందించింది కిరణ్ రావు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సందీప్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. యానిమల్ సినిమాను తాను చూడలేదని.. కేవలం తాను సినిమాల్లో మహిళల ప్రాతినిధ్యం గురించి మాత్రమే మాట్లాడుతున్నాని అన్నారు. “నేను మహిళల ప్రాతినిధ్యం గురించి అనేక వేదికలలో .. చాలా సమయాల్లో మాట్లాడాను. కానీ నేను ఏ సినిమా పేరును తీసుకోలేదు. ఇది నిజంగా ఒక సినిమా గురించి కాదు. అనేక సినిమాల్లో స్త్రీల సమస్యలపై మాట్లాడాను. అతడు అన్నట్లుగా తన సినిమాపై నేను ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ ఆయన ఎందుకు అలా ఊహించుకుంటున్నాడు. నేను ఆయన సినిమాలు చూడలేదు. కానీ ఎందుకు నా మాటలపై రియాక్ట్ అయ్యారు అనేది మీరు అతడిని అడగాలి. ఆయన పేరును, సినిమా పేరును నేను తీసుకోలేదు” అని అన్నారు.

అంతేకాకుండా.. సందీప్ రెడ్డి మాట్లాడిన ఖంబే జైసీ ఖాదీ హై పాటకు గతంలో అమీర్ ఖాన్ క్షమాపణలు చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. అలాంటి వివాదాస్పద చిత్రాలు పాటలు చిత్రీకరించి.. ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన వారిలో అమీర్ ఒకరు అని అన్నారు. అమీర్ ఖాన్ సినిమాల గురించి నాతో కాకుండా ఆయనతో నేరుగా మాట్లాడాలని సందీప్ కు రిక్వెస్ట్ చేస్తున్నాని అన్నారు . ప్రస్తుతం కిరణ్ రావు చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.