Fighter: మరో వివాదంలో హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’.. లీగల్‌ నోటీసులు పంపిన IAF ఆఫీసర్‌.. కారణమిదే

హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె జంటగా నటించిన 'ఫైటర్'. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మంచి వసూళ్లను సాధిస్తోంది. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. అదే సమయంలో ఫైటర్‌ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. వీటన్నింటి మధ్య

Fighter: మరో వివాదంలో హృతిక్‌ రోషన్‌ 'ఫైటర్‌'.. లీగల్‌ నోటీసులు పంపిన IAF ఆఫీసర్‌.. కారణమిదే
Fighter Movie
Follow us

|

Updated on: Feb 13, 2024 | 10:27 AM

హృతిక్ రోషన్ , దీపికా పదుకొణె జంటగా నటించిన ‘ఫైటర్’. గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ మంచి వసూళ్లను సాధిస్తోంది. బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతోంది. అదే సమయంలో ఫైటర్‌ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై నిషేధం విధించారు. వీటన్నింటి మధ్య ఈ సినిమా ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడింది. హృతిక్‌, దీపికల సినిమాపై ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తీవ్ర అభ్యంతరం చేశారు. ఎయిర్‌ ఫోర్స్‌ సాహసాల నేపథ్యంలో ఫైటర్‌ మూవీ రూపొందింది. అయితే కమర్షియల్‌ టచ్‌ ఇచ్చేందుకు సినిమాలో రొమాంటిక్ సీన్లు, బికినీ డ్యాన్స్‌లు, నటీనటుల మధ్య ముద్దులు జోడించారు. ఇవే సన్నివేశాలు ఇప్పుడు సినిమాని ఇరకాటంలో పడేశాయి. ‘ఫైటర్’ సినిమాలో హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ దీపికా పదుకొణె మధ్య కొన్ని హాట్ సీన్స్ ఉన్నాయి. బీచ్‌లో చిత్రీకరించిన ఓ పాట కూడా హాట్ హాట్‌గా ఉంది. హృతిక్, దీపిక మధ్య కొన్ని ముద్దు సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఒక సన్నివేశంలో, హృతిక్ మరియు దీపికా పదుకొణె ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటారు. ఈ సన్నివేశంపై ఎయిర్ ఫోర్స్ అధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినిమాపై కేసు వేశాడు.

‘ఫైటర్’ సినిమాలో హృతిక్, దీపికా ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి ముద్దులు పెట్టుకునే సన్నివేశం వైమానిక దళానికి విరుద్ధమని అసోం ఎయిర్ ఫోర్స్ అధికారి సౌమ్య దీప్ దాస్ మండిపడ్డాడు. వైమానిక దళం అనుసరించే నియమాలు, యూనిఫాంకు ఇది అవమానమంటూ ఫైటర్‌ చిత్ర బృందానికి లీగల్‌ నోటీసులు పంపాడు. ‘ఫైటర్’ సినిమా లో హృతిక్ రోషన్, దీపికా పదుకొణెలతో పాటు అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు నటించారు. ఇది భారతదేశంలోనే తొలి ఎయిర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చిత్ర బృందం ప్రచారం చేసింది. ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీని గురించి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ.. ‘భారతదేశంలో చాలా మందికి ఫైటర్ జెట్‌లు, వాటి వేగం, వాటి సాంకేతికత, వాటి ప్రాముఖ్యత గురించి తెలియదు కాబట్టి మా సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఐఏఎఫ్ లీగల్ నోటీసులు

హృతిక్ రోషన్ ట్విటర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్