AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: సౌత్ భారీ మల్టీస్టారర్.. ఆ స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ బాద్ షా.. బొమ్మ బ్లాక్ బస్టరే..

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈమూవీతో సౌత్ ఇండస్ట్రీలోనూ సంచలనం సృష్టించాడు షారుఖ్. దీంతో ఇప్పుడు బాద్ షా నెక్ట్స్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు షారుఖ్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు ? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు షారుఖ్ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. అదెంటంటే.. బాద్ షా సౌత్ సూపర్ స్టార్ సినిమాలో కనిపించనున్నారట. అ

Shah Rukh Khan: సౌత్ భారీ మల్టీస్టారర్.. ఆ స్టార్ హీరో సినిమాలో బాలీవుడ్ బాద్ షా.. బొమ్మ బ్లాక్ బస్టరే..
Shahrukh Khan
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2024 | 6:52 AM

Share

బాలీవుడ్ బాద్ షా ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు సైలెంట్‏ అయిన షారుఖ్.. గతేడాది పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ వెంటనే జవాన్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈమూవీతో సౌత్ ఇండస్ట్రీలోనూ సంచలనం సృష్టించాడు షారుఖ్. దీంతో ఇప్పుడు బాద్ షా నెక్ట్స్ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు షారుఖ్ ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు ? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు షారుఖ్ నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. అదెంటంటే.. బాద్ షా సౌత్ సూపర్ స్టార్ సినిమాలో కనిపించనున్నారట. అతను మరెవరో కాదు.. సౌత్ స్టార్ హీరో యష్.

కేజీఎఫ్ 1,2 సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ అందుకున్నాడు యష్. ఈ రెండు చిత్రాలతో ఈ హీరో తదుపరి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే చాలా కాలం తర్వాత ఒకేసారి రెండు ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు. ఇందులో టాక్సిక్ ఒకటి. గతేడాది డిసెంబర్ లో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన టాక్సిక్ లుక్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి మలయాళ డైరెక్టర్ గీతు మోహన్ దాసు దర్శకత్వం వహించారు. అయితే లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈమూవీలో అతిథి పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపించనున్నారట. ఇప్పటికే మేకర్స్ షారుఖ్ ను సంప్రదించారని.. ఇంకా బాద్ షా నిర్ణయం వెల్లడించాల్సి ఉందని తెలుస్తోంది.

ఒకవేళ షారుఖ్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. సౌత్ ఇండస్ట్రీలో ఇదే భారీ మల్టీస్టారర్ కానుంది. అంతేకాకుండా.. షారుఖ్ నటించనున్న మొదటి సౌత్ మల్టీస్టారర్ ఇదే. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. అలాగే అటు యష్ కూడా హిందీలో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామయణంలో రావణుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్