Twitter : అన్నంత పని చేసిన ఎలన్ మస్క్.. సినీ సెలబ్రెటీలకు షాక్ ఇచ్చిన ట్విట్టర్

ఇప్పుడు బ్లూ టిక్ లకు ఛార్జ్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మస్క్ భావిస్తున్నారు. బ్లూటిక్ కావాలనుకునే వాళ్లు వెబ్ ద్వారా అయితే నెలకు 8 అమెరికన్ డాలర్లు.. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా పే చేస్తే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

Twitter : అన్నంత పని చేసిన ఎలన్ మస్క్.. సినీ సెలబ్రెటీలకు షాక్ ఇచ్చిన ట్విట్టర్
Twitter
Follow us

|

Updated on: Apr 21, 2023 | 2:37 PM

2009లో ట్విట్టర్ బ్లూ టిక్ సిస్టంను ప్రవేశపెట్టింది. ఈ బ్లూ టిక్ ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సంస్థల ఖాతాలు ఒరిజినల్ అని లెక్క. ఇతరులు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసినా.. అవి ఒరిజినల్ అకౌంట్లు కావని యూజర్లకు అర్థమయ్యేందుకు బ్లూ టిక్ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బ్లూ టిక్ లకు ఛార్జ్ చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మస్క్ భావిస్తున్నారు. బ్లూటిక్ కావాలనుకునే వాళ్లు వెబ్ ద్వారా అయితే నెలకు 8 అమెరికన్ డాలర్లు.. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా పే చేస్తే నెలకు 11 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో నిర్ధారిత ఫీజులను చెల్లించని ఖాతాలకు తాజాగా ట్విట్టర్ బ్లూ టిక్ ను తొలగించింది. బ్లూ టిక్ కోల్పోయిన వారిలో రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, యోగి ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరుల ఖాతాలకు బ్లూ టిక్ ను ట్విట్టర్ తొలగించింది.

టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్, మోహన్ బాబు, అల్లు అర్జున్, వెంకటేశ్, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, నితిన్, రామ్ చరణ్, నాగచైతన్య, అక్కినేని అఖిల్ తదితరుల ఖాతాలకు బ్లూ టిక్ ను తొలగించింది. జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగార్జున, మహేశ్ బాబు, మంచు విష్ణుకు బ్లూ టిక్ లు ఉన్నాయి. తమిళ స్టార్లు రజనీకాంత్, విజయ్, శింబు కూడా బ్లూ టిక్ కోల్పోయారు.

ఇలా ఉన్నారేంట్రా బాబు..ట్రాఫిక్‌లో ఆగివున్న చోటే కక్కుర్తి పని
ఇలా ఉన్నారేంట్రా బాబు..ట్రాఫిక్‌లో ఆగివున్న చోటే కక్కుర్తి పని
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
ప్రపంచంలోనే అత్యంత అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవే
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
మా పిల్లి తప్పిపోయింది... ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి..?పోస్టర్లు
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
కాంగ్రెస్ నుంచి కొనసాగుతున్న వలసల ప్రవాహం
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్.. షూటింగ్‏కు బ్రేక్ ?..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
మొసలితో తలపడ్డ తాబేలు.. ! చివరిదాకా పోరాడింది.. కట్‌చేస్తే..
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
ఓట‌రు గుర్తింపు కార్డుని డౌన్ లోడ్ చేసుకోండిలా ??
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
సీనియారిటీ కాదు.. సిన్సియారిటీ చూసి ఓటెయ్యాలి: వైఎస్ జగన్
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే
వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తింటే.. జరిగేది ఇదే