Tollywood: చమికీల డ్రెస్‌లో.. ముద్దుగా నవ్వుతున్న ఈ పాల బుగ్గల చిన్నది ఇప్పుడు పెద్ద హీరోయిన్..
పై ఫొటోలో ఉన్న చిన్నారి తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాక్టర్స్‌తో నటించింది. ఐటమ్ సాంగ్స్‌లో నటించి తన అందాలతో కుర్రాళ్లను మైమరిపించింది. ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోవడంతో నిర్మాతగా కొత్త ఇన్సింగ్స్ మొదలుపెట్టింది. తనెవరో మీరు కనిపెట్టగలరా..?

తెలుగు ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆయా సెలబ్రిటీల ఫ్యాన్స్ పోటీపడి మరీ వాటిని వైరల్ చేస్తున్నారు. ఏదైనా అకేషన్ ఉంటే చాలు హ్యాష్ ట్యాగ్స్, ఫోటోలతో మోత మోగించేస్తున్నారు. అందులో చిన్ననాటి ఫోటోలు అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. కొందరు నటీనటులను చిన్నప్పటితో పోల్చుకోలేకపోతున్నారు చాలామంది. అలాంటి ఓహీరోయిన్ చిన్నప్పటి ఫోటో మీ ముందుకు తీసుకొచ్చాం. ఈమె ఒకప్పడు మంచి స్టార్‌గా రాణించింది. తెలుగులోని టాప్ హీరోలతో నటించింది. తక్కువ వయసులోనే ఐటమ్ సాంగ్స్‌లో కూడా మెరిసింది. ప్రజంట్ యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పి నిర్మాతగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. తనెవరో కాదు బబ్లీ బ్యూటీ చార్మీ.
ఎర్లీ ఏజ్‌లోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది చార్మీ. హిందీ మూవీ ‘ముజ్ సే దోస్తీ కరోగి’లో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించింది. 15 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు తమిళంలో ‘కాదల్ అలివదిల్లయ్’, మలయళంలో ఆమె చేసిన ‘ కట్టుచెంబాకమ్’ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత ‘నీతోడు కావాలి’ చిత్రంలో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అయినా సక్సెస్ దక్కలేదు. అప్పుడు మన కృష్ణవంశీ కళ్లలో పడి.. ‘శ్రీఆంజేనేయం’ సినిమాలో మంచి పాత్రకు సెలెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో ఆమె యాక్టింగ్ బాగుండటంతో.. ఈ బొద్దుగుమ్మకు ఇక్కడ మంచి అవకాశాలు వచ్చాయి. స్టార్ హీరోల సరసన ఆడిపాడింది.
అనుకోకుండా ఒక రోజు, లక్ష్మీ, స్టైల్, రాఖీ, మంత్ర, జ్యోతి లక్ష్మి సినిమాలు ఛార్మీకి మంచి పేరు తెచ్చారు. వరుసగా ప్లాపులు పలకరించడంతో 2015 తర్వాత యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పిన ఛార్మి.. నిర్మాతగా సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవలే ఆమె కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన లైగర్ సినిమా నిరాశపరిచింది. త్వరలో కొత్త సినిమాతో బ్యాంగ్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
