రోమ్‌లో ప్రేమ జంట హల్చల్.. పబ్లిక్‌గా భర్తకు లిప్ కిస్ ఇచ్చిన ప్రియాంక. వైరల్ వీడియో..
నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీ కపుల్స్‌లో ప్రియాంక, నిక్‌జోనస్ ఒకరు. కెరీర్ పరంగా ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే వెంటనే రెక్కలు కట్టుకొని పర్యాటక ప్రదేశాల్లో వాలిపోతుంటారీ స్టార్ కపుల్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట రోమ్‌లో ఎంజాయ్...

నిత్యం వార్తల్లో నిలిచే సెలబ్రిటీ కపుల్స్‌లో ప్రియాంక, నిక్‌జోనస్ ఒకరు. కెరీర్ పరంగా ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే వెంటనే రెక్కలు కట్టుకొని పర్యాటక ప్రదేశాల్లో వాలిపోతుంటారీ స్టార్ కపుల్. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట రోమ్‌లో ఎంజాయ్ చేస్తోంది. రోమ్ వీధుల్లో సందడి చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్‌గా లిప్‌కిస్ ఇచ్చుకున్న ఈ జంట, ఐస్ క్రీం తింటూ సందడి చేశారు. నిక్ జోనస్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఇలా పోస్ట్ చేశాడో లేదో అలా వైరల్ అవుతోంది. క్షణాల్లో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రియాంక ప్రస్తుతం తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.



View this post on Instagram
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఈ వెబ్ సిరీస్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిర్మించింది. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఇదిలా ఉంటే ప్రియాంక, నిక్ జోనాస్‌లు 2018లో డిసెంబర్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక 2022 జనవరిలో ఈ జంట సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయం విధితమే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
