Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ ఫ్యాన్స్‌‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న త్రివిక్రమ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గా వచ్చిన రీజనల్  బడా సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది సర్కారు వారి పాట.

Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ ఫ్యాన్స్‌‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్న త్రివిక్రమ్..!
Trivikram, Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 17, 2022 | 9:00 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )తాజాగా సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గా వచ్చిన రీజనల్  బడా సినిమాల్లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది సర్కారు వారి పాట. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ ను రాబట్టి  దూసుకుపోతుంది. ఈ మూవీలో కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) మహేశ్‌ పక్కన సందడి చేసింది. ఈఎమ్‌ఐలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తూ పరశురామ్ ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ప్లస్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి.

గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ సినిమా రాబోతుంది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్టైల్ లో టైటిల్ ఉండనుందని తెలుస్తుంది. జులైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ నెల 31వ తేదీన ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు  టాక్ వినిపిస్తుంది. ఈ నెల 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు 28వ సినిమా టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్ జోడీగా బుట్టబొమ్మ పూజ హెగ్డే అలరించనుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని  అందించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Keerthy Suresh: ఆడిపోయే ఫోజులతో కవ్విస్తున్న కళావతి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Sreemukhi: యెల్లో డ్రెస్ లో యాంకరమ్మ నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. శ్రీముఖి లేటెస్ట్ పిక్స్

Shamna Kasim: పింక్ శారీ లో పూర్ణ పరువాల విందు.. వైరల్ అవుతున్న షామ్నా లేటెస్ట్ పిక్స్