Mansoor Ali Khan: తగ్గేదే లే అంటున్న మన్సూర్ అలీ ఖాన్.. ముదురుతున్న వివాదం
హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వివాదాస్ప వ్యాఖ్యలపై రగడ కంటిన్యూ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్ సీన్లలో నటించానని, లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందనుకున్నానని తెలిపారు. కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించిందని మన్సూర్ చెప్పారు.

మన్సూర్-త్రిష మధ్య వివాదంలో కొత్త ట్విస్ట్. త్రిష, ఖుష్బూ, చిరంజీవిపై పరువునష్టం దావా వేస్తానని మన్సూర్ ప్రకటించడం కోలివుడ్‌లో సంచలనం రేపుతోంది. తనను మాటలతో హింసించిన వారిపై లాయర్‌తో వెళ్లి కేసు పెడతానని వెల్లడించారు. హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వివాదాస్ప వ్యాఖ్యలపై రగడ కంటిన్యూ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ మాట్లాడుతూ గతంలో ఎన్నో చిత్రాల్లో రేప్ సీన్లలో నటించానని, లియోలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందనుకున్నానని తెలిపారు. కాకపోతే, అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించిందని మన్సూర్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సినీ ప్రముఖులంతా మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. అటు మహిళా కమిషన్ కూడా స్పందించి కేసు నమోదు చేసింది. చివరికి మన్సూర్ క్షమాపణలు చెప్పడం..త్రిష పాజిటివ్గా స్పందిస్తూ.. ఈ వివాదానికి ముగింపు పలకడం జరిగింది. ఇక ఈ వివాదం సద్దు మణిగింది అనుకునే లోపే..మన్సూర్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్‌తో తెరపైకి వచ్చారు.
వాస్తవాలు తెలుసుకోకుండా తనపై అభియోగాలు చేసిన త్రిష, ఖుష్బు, చిరంజీవిలపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, మాటలతో హింసించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్లు నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రకటించారు. ఇక తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా ఇవాళ కోర్టులో కేసు వేయబోతున్నట్లు వెల్లడించారు. త్వరలో వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని మన్సూర్ తెలిపారు. ఎవరో కావాలనే వైరల్ చేసిన వీడియోని తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్లు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, అలాగే మరికొన్ని ఆధారాలతో కేసు వేస్తానని మన్సూర్ చెప్పారు.
మన్సూర్‌పై మూడరోజుల క్రితం త్రిషకు చిరంజీవి, లోకేష్ కనగరాజ్, ఖుష్బు, మాళవిక మోహనన్, నితిన్, చిన్మయి, సపోర్ట్‌గా నిలిచారు. త్రిషపై మన్సూర్ వ్యాఖ్యలను అంతా తీవ్రంగా ఖండించాలని చిరంజీవి ట్వీట్ చేశారు. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారన్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా సపోర్ట్‌గా నిలబడతానని ట్వీట్ చేశారు చిరంజీవి. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి త్రిష అంశంపై స్పందించడంతో ఈ వివాదం మరింత పెద్దగా మారింది. తమిళ సినీ ఇండ్రస్ట్రీలో విలన్‌గా మన్సూర్‌కి చాలావరకు రేప్ సన్నివేశాలు కలిగి ఉండే పాత్రలే ఎక్కువ వస్తుండడంతో..ఇందులో కూడా అలాంటి రోల్ ఇస్తారనుకున్నట్లు, కానీ అసలు త్రిషతో సన్నివేశమే లేని పాత్ర ఇచ్చారని క్లారిటీ ఇచ్చారు. దీన్ని కొంతమంది నెగిటివ్‌గా ప్రమోట్ చేసి ఇంత పెద్ద వివాదం సృష్టించారని అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం మరింత వైరల్ అవుతుందా..? లేక ఫుల్‌స్టాఫ్ పడుతుందా..? చూడాలి మరి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
