Trisha Krishnan: అమ్మ బుడతా.. నువ్వు మాములోడివి కాదురా..! త్రిషకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చిన గడుగ్గాయి.. వీడియో షేర్ చేసిన బ్యూటీ
టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించిన త్రిష ఈ మధ్య తెలుగు సినిమాలను తగ్గించారు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఆమధ్య కాలంలో త్రిష ఫేడ్ అవుట్ అవుతున్నారు అనుకునే సమయంలో..

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించడం అంటే అంత సులువైన విషయం కాదు. అందం అభినయం ఉన్న అదృష్టం కూడా ఉండాలి. కొత్త అందాల ధాటికి తట్టుకొని నిలబడగలగాలి. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించాలి. అలా చేస్తూ కంటిన్యూ అవుతున్న భామల్లో స్టార్ హీరోయిన్ త్రిష ఒకరు. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణించిన త్రిష ఈ మధ్య తెలుగు సినిమాలను తగ్గించారు. కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఆమధ్య కాలంలో త్రిష ఫేడ్ అవుట్ అవుతున్నారు అనుకునే సమయంలో 96 సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో సమానంగా నటించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.
ఇక రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో త్రిష ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఐశ్వర్య రాయ్ లాంటి విశ్వసుందరి పోటీ ఇస్తూ త్రిష తన అందంతో కట్టిపడేసారు. వయసు పెరుగుతున్నా తరగని సోయగంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు త్రిష. ఈ అమ్మడి అందానికి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు ఫిదా అవుతారు. దానికి ఉదాహరణే ఈ వీడియో.




త్రిష సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు త్రిష. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈవీడియోలో ఒక బుడ్డోడు త్రిషకు లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. అయితే అది రియల్ గా కాదు.. ఒక షాపింగ్ మాల్ దగ్గర ఏర్పాటు చేసిన త్రిష పోస్టర్ కు ఓ బుడతడు ముద్దుపెడుతూ కనిపించాడు. తల్లి ఎత్తుకొని ఉండగా ఆ బుడతడు త్రిష ఫొటోకు ముద్దు పెట్టాడు. ఈ వీడియోను త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




