AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : చిరుతో చిందేయనున్న చెన్నై బ్యూటీ.. దాదాపు 15ఏళ్ల తర్వాత మెగాస్టార్ సినిమాలో ఆ హీరోయిన్..

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. చిరు సినిమాలో సెకండ్ హీరోయిన్ గానైనా కనిపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏ హీరోయిన్‌ అయినా ఒక్కసారి చిరు పక్కన నటించిందంటే చాలు ఇక ఆ అమ్మడి రేంజ్

Chiranjeevi : చిరుతో చిందేయనున్న చెన్నై బ్యూటీ.. దాదాపు 15ఏళ్ల తర్వాత మెగాస్టార్ సినిమాలో ఆ హీరోయిన్..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 7:58 PM

Share

Megastar Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. చిరు సినిమాలో సెకండ్ హీరోయిన్ గానైనా కనిపించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఏ హీరోయిన్‌ అయినా ఒక్కసారి చిరు పక్కన నటించిందంటే చాలు ఇక ఆ అమ్మడి రేంజ్ మారిపోతుంటుంది. అలాగే.. ఒక్క సారి బాసు పక్కన నటించి మంచి కెమెస్ట్రీ కుదిరితే చాలు.. ఇక బాసుతో వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి మరి.. ఒకప్పటి హీరోయిన్లు రాధ, రాధిక, విజయశాంతిలు చిరు జోడిగా ఎన్నో సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పటి హీరోయిన్‌లంతలా కాకపోయినా ఇప్పటి తరంలో… ఓ హీరోయిన్‌ చిరు సరసన నటించి మంచి పేరుతెచ్చుకుంది. ఇప్పుడు మరో సారి చిరు సినిమాలో అవకాశం కొట్టేసింది ఇంతకు ఆ భామ ఎవరనుకుంటున్నారా ..

2006లో మెగాస్టార్‌ హీరోగా మురుగదాస్‌ డైరెక్షన్‌లో రిలీజైన చిత్రం ‘స్టాలిన్’‌. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా త్రిష నటించి మంచి పేరు తెచ్చుకుంది. మళ్లీ 15 సంవత్సరాల తరువాత అదే త్రిష మెగాస్టార్‌ చిరంజీవి పక్కన ‘లూసిఫర్‌’ తెలుగు రీమేక్‌ లో నటించనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ ను తెలుగులో మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెగాసటర్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని సినిమాలో కొన్ని మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా లో హీరోయిన్ గా పలువురిపేర్లు వినిపించాయి. మొదట్లో నయనతార పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు త్రిష పేరు తెరపైకి వచ్చింది.

మరో  విషయం ఏంటంటే.. కొరటాల శివ ‘ఆచార్య’లో కూడా మొదట త్రిషనే హీరోయిన్‌గా అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారు. అయితే నయన్ తారను మొదట్లో అనుకున్నప్పటికీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాక ఈ ఆఫర్ మున్ను సున్నితంగా తిరస్కరించారట. దాంతో ఆమె ప్లేసులోకి త్రిష ఎంపిక చేశారట. మరోసారి చిరుతో కలిసి నాటించడానికి త్రిష కూడా ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Actor Sunil : మరో సినిమాను అనౌన్స్ చేసిన సునీల్.. ఈ సారి భయపెట్టనున్న కమెడియన్ కం విలన్

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!